కరెంటు ఇచ్చే బీఆర్ఎస్ కావాలా–కారు చీకట్లో ఉంచే కాంగ్రెస్ కావాల్నా – బీరం హర్షవర్ధన్ రెడ్డి

కరెంటు ఇచ్చే బీఆర్ఎస్ కావాలా–కారు చీకట్లో ఉంచే కాంగ్రెస్ కావాల్నా – బీరం హర్షవర్ధన్ రెడ్డి

ముద్ర.వీపనగండ్ల: కరెంటు ఇచ్చే బీఆర్ఎస్ పార్టీ కావాలో–కారు చీకట్లో ఉంచే కాంగ్రెస్ పార్టీ కావాలో ప్రజలు ఆలోచించుకొని ఓటు వేయాలని బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు.చిన్నంబావి మండలం వెలగొండ గ్రామంలో  బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ప్రచారంలో అడుగడుగునా గ్రామ ప్రజలు నీరాజనం పలికారు. ఎమ్మెల్యే బీరం మాట్లాడుతూ బయన్న గట్టు రోడ్డు నిర్మాణానికి 30 లక్షల రూపాయలు మంజూరు చేశామని,వెలగొండ గ్రామంలో సి.సి రోడ్లు , పల్లె చెరువు దగ్గర కల్వర్టు మన ఊరు మనబడి ద్వారా పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దామని అన్నారు.

ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత చేసిన అభివృద్ధి పనులు మీ కళ్ల ముందే ఉన్నాయని,కళ్ల బొల్లి కబుర్లు చెబుతున్న నాయకులను నమ్మవద్దని అభివృద్ధికి పట్టం కట్టాలని,మరొక్కసారి ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని కారు గుర్తుకు ఓటు వేసి, వేయించాలని ప్రజలను బీరం హర్షవర్ధన్ రెడ్డి కోరారు. ప్రచారంలో రాష్ట్ర నాయకులు అభిలాస్ రావు, ఎంపీపీ సోమేశ్వరమ్మ, జడ్పిటిసి వెంకటరమణమ్మ,డాక్టర్ కురువ విజయ్, పెద్దమారుర్ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, ఆనంద్ యాదవ్ తదితరులు ఉన్నారు.