ఆరోజు మాట ఇచ్చిన ఈరోజు మాట నిలబెట్టుకున్న...

ఆరోజు మాట ఇచ్చిన ఈరోజు మాట నిలబెట్టుకున్న...

దానికి నిదర్శనం మన మార్కండేయ లిఫ్ట్ 

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: మార్కండేయ లిఫ్ట్ పూర్తి కావడంతో చెరువులో జలాలను గిరిజనులతో రైతులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి ఆ జలాలతో మార్కండేయ స్వామీ వారికి అభిషేకం చేసిన ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి  బిజినపల్లి మండలంలోని 5 గ్రామాల,17 గిరిజన తాండల ఎన్నో సంవత్సరాల కళలను ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి  మార్కండేయ లిఫ్ట్ తో నెరవేర్చినందుకు ఈరోజు బిజినపల్లి మండలంలోని మమ్మయి పల్లి గ్రామంలోని మార్కండేయ దేవాలయం దగ్గరికి విచ్చేసిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికిన మండల రైతన్నలు, ప్రజలు, ఈ  సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ బిజినపల్లి మండలంలోని గంగారం,సాయిన్ పల్లి,మమ్మాయి పల్లి,సాయిన్ పల్లి,లట్టుపల్లి,

17 గిరిజన తాండల కలల ప్రాజెక్టు సుమారు 8,000 ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  2018 ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చిన మార్కండేయ లిఫ్ట్ నిర్మాణానికి 86 కోట్ల నిధులను మంజూరు చేయించి లిఫ్ట్ పనులను పూర్తి చేయడం జరిగింది అని అన్నారు,వ్యవసాయం చేస్తున్న రైతులకు ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు ఎనమిది వేల ఎకరాలకు సాగునీరు  ఈ ప్రాజెక్టు ద్వారా అందుతుందని తెలిపారు, ఈ లిఫ్ట్ నిర్మాణంతో బిజినపల్లి మండలం మొత్తం పూర్తిగా సస్యశ్యామలం అవుతుంది అని అన్నారు, అడిగిన వెంటనే మార్కండేయ లిఫ్ట్ కు మంజూరు చేసినందుకు బిజినపల్లి మండల రైతాంగం తరుపున ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు, ఈ కార్యక్రమంలో జక్క రఘునందన్ రెడ్డి నాగం శశిధర్ రెడ్డి  ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు,రైతన్నలు, పెద్దఎత్తున పాల్గొన్నారు.