11న పాత్రికేయులతో కేంద్ర మంత్రి సమావేశం

 11న పాత్రికేయులతో కేంద్ర మంత్రి సమావేశం
  • ఎక్కడైనా ఎప్పుడైనా అవినీతిని నిరూపించేందుకు సిద్ధం
  • 11న పాత్రికేయులతో కేంద్ర మంత్రి సమావేశం
  • బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దిలీప్ ఆచారి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ : నియోజకవర్గ ప్రజలకు సీఈవోగా ప్రకటించుకున్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కార్పొరేట్ వ్యాపారిగా రుజువు చేసుకున్నారని నియోజకవర్గం కి సేవ చేసేందుకు రాలేదని రాజకీయాలను వ్యాపారమయం చేసి అక్రమంగా కూడబెట్టుకునేందుకే రావడం జరిగిందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దిలీప్ చారి అన్నారు శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల వివరించేందుకు ఈనెల 30వ తేదీ వరకు మహాజన సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు .ఈ నెల 11న జిల్లా కేంద్రంలోని హిమాలయ కన్వెన్షన్ హాల్ లో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే పార్లమెంటు పరిధిలోని జర్నలిస్టులతో సమావేశాన్ని నిర్వహిస్తున్నారని సమావేశానికి నియోజకవర్గం జర్నలిస్టులు భారీగా హాజరై విజయవంతం చేయాలని కోరారు.

స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి నిర్వహించిన అవినీతి అక్రమాలు అవినీతి సొమ్మును బహిర్గతం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఏ పథకం పేరు చెప్పినా సరే  వాటిలో అవినీతి అక్రమాలను నిరూపిస్తామని బహిరంగ చర్చ సొంత గ్రామంలో అయినా సరే దత్తత గ్రామంలో అయినా సరే మినీ ట్యాంక్ బండ్ అయిన మెడికల్ కళాశాల అయిన నిరూపించేందుకు తాము సిద్ధమని నిరూపిస్తే రాజీనామా చేస్తావా అని సవాల్ విసిరారు. మరి జనార్దన్ రెడ్డి చీఫ్ ఎస్టేట్ వ్యాపారిగా వ్యవహరిస్తూ ప్రశ్నించే వారిపై దౌర్జన్యాలు అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పారదర్శకంగా ప్రజలకు సేవలు చేస్తుంటే రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం సంపాదన పెంచుకునేందుకు కార్యక్రమాలు చేపట్టారని విమర్శించారు.

ముడుపులు ముడుతున్న సంగతి నిరూపిస్తామని అన్నారు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సీఈవో కాదని నియోజకవర్గానికి పట్టిన దరిద్రం అని మండిపడ్డారు మందబలంతో నియోజకవర్గంలో దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని రైతుల సమస్యలను పట్టించుకోవడంలేదని తరుగు పేరుతో మోసం చేస్తున్న ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని నిలదీశారు ఈ సమావేశంలో నాయకులు రాజ వర్ధన్ రెడ్డి బాలయ్య నరేంద్ర చారి బచ్చిరెడ్డి లోహిత్ రెడ్డి రాము వెంకటేశ్వర్లు భూషయ్య సుదర్శన్ ప్రమోద్ నాగేష్ చారి తదితరులు పాల్గొన్నారు