మానవీయం లేని ప్రభుత్వాన్ని గద్దె దించాలి

మానవీయం లేని ప్రభుత్వాన్ని గద్దె దించాలి

2013 భూసేకరణ చట్టం ప్రకారం దళిత గిరిజనులను ఆదుకోవాలి


 సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా : భారత రాజ్యాంగం ప్రకారం చట్టబద్ధతతో మానవీయ కోణంతో పథకాలను రూపొందించి అమలు చేయవలసిన రాష్ట్ర ప్రభుత్వం దళిత గిరిజనుల భూములను పోలీసులను అడ్డం పెట్టుకొని స్వాధీనం చేసుకోవడం క్షమించరాని నేరమని వెంటనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని వట్టెం రిజర్వాయర్ భూ నిర్వాసితులైన నాలుగు గిరిజన తండాలు ఒక గ్రామానికి చెందిన దళిత ప్రజలను ఆదుకునేందుకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం వారికి పరిహారం చెల్లించాలని సీఎల్పీ నేత డాక్టర్ మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు ఆదివారం పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ప్రాజెక్టు పనులను పరిశీలించిన అనంతరం బాధిత భూ నిర్వాసితుల సమస్యలను తెలుసుకొని ఇంద్రకల్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖను రాశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం భూ నిర్వాసితులను ఆదుకునేందుకు 2013 భూ సేకరణ చట్టాన్ని తీసుకువచ్చి దళిత గిరిజనులకు భూములు కోల్పోయిన వారికి భూములను ఇవ్వాలని గ్రామాన్ని ముంపుకు గురి అయితే నూతన గ్రామాన్ని నిర్మించి అన్ని వసతులను కల్పించి వారికి అప్పగించాలని భూ నిర్వాసితుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని స్పష్టం చేయడం జరిగిందని వీటన్నిటిని తుంగలోతుకి అమాయక దళిత గిరిజనులను భయభ్రాంతులకు గురి చేసి భూములను స్వాధీనం చేసుకోవడం ప్రభుత్వానికి తగదని హెచ్చరించారు. జీవో నెంబర్ 123 ప్రకారం బలవంతంగా పేదలకు న్యాయం చేయకుండా భూములను స్వాధీనం చేసుకోవడం వారిని నైతికంగా చంపేయడంతో సమానమని అన్నారు 2017 జూన్ 11న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఇక్కడే కూర్చుని 30 నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చి ఏడు సంవత్సరాలు గడుస్తున్నా 50 శాతం పనులను కూడా ఎందుకు పూర్తి చేయలేకపోయారని నిలదీశారు. భూ నిర్వాసితులకు ఇచ్చిన హామీలను పూర్తి చేసిన తర్వాతే భూములను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించిన సీఎం ఇందుకు భిన్నంగా ముందుగా భూములను స్వాధీనం చేసుకోవడం ప్రజలను మోసం చేయడమే అన్నారు ఈ ప్రాజెక్టులో 45 ఎకరాల వ్యవసాయ భూమి 463 కు పైగా నివాస గృహాలు ముంపునకు గురయ్యాయని వివరించారు 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలని కోరిన దళిత గిరిజనులను భూ నిర్వాసితులను జైలుకు పంపుతామని బెదిరించడం రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయడమేనని విమర్శించారు పలువురు దళారులు కొంతమంది రైతుల డబ్బులు స్వాహా చేశారని ఆరోపించారు సమ సమాజ నిర్మాణం స్థాపనకు భారత రాజ్యాంగం ప్రకారం పాలన సాగించాలని ముఖ్యమంత్రి నిర్ణయాలు సంక్షేమం శ్రేయో రాజ్యం దిశగా లేవని అన్నారు ఈ సమావేశంలో జిల్లా ఇన్చార్జ్ నిరంజన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అర్థం రవి యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేనారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి పిసిసి సభ్యులు బాలా గౌడ్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు హాబీబ్ ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు సీనియర్ నాయకులు వల్లభ రెడ్డి తాడూర్ జడ్పిటిసి రోహిణి గోవర్ధన్ రెడ్డి తెలకపల్లి జడ్పిటిసి సుమిత్ర బాలయ్య మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మయ్య నాగర్ కర్నూల్ మండల పార్టీ అధ్యక్షుడు కోటయ్య యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రాము తదితరులు పాల్గొన్నారు