ధాన్యం సమస్యలు పరిష్కరిస్తాం

ధాన్యం సమస్యలు పరిష్కరిస్తాం

మంత్రి హరీష్ రావు సమీక్ష 
ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ జిల్లాలో  ధాన్యం కొనుగోలు రవాణా తదితర సమస్యల పరిష్కారం కోసం చర్చించిన్నట్లు రాష్ట్ర ఆర్ధిక వైద్య ఆరోగ్య శాఖా మంత్రి  హరీష్ రావు తెలిపారు. రాష్ట్ర కమిషనర్ అనిల్ కుమార్ జిల్లాలో పర్యటించాలని సూచించమన్నారు. ఆదివారం   కలెక్టరేట్ లో ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమీక్షా సమావేశం నిర్వహించారు. 
 70 శాతం మేర ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూరయ్యిందని, ఇప్పటి వరకు 2 కోట్ల 20 లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, సోమవారం పౌర సరఫరాల  సంస్థ చైర్మన్, కమీషనర్ లను జిల్లాకు పంపి మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేసి వేగవంతానికి ఆదేశాలిస్తామన్నారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించామన్నారు. జూన్ 24 నుండి 30 వరకు అర్హులైన  గిరిజనులకు పోడు  పట్టాలు పంపిణి చేయాలని, జులై మొదటి వారంలో దళిత బంధు యూనిట్లు గ్రౌండింగ్, ప్రతి నియోజక వర్గంలో  స్వంత జాగా ఉన్న 3 వేల  మందికి   ఆర్ధిక సహాయం అందించి ఇండ్లు  ప్రారంభించడం, కొత్త సభ్యత్వాలు తీసుకున్న  మత్స్యకారులకు గుర్తింపు కార్డులు అందించాలన్నారు. ఎస్సి,ఎస్టీ, బిసిలకు సంబంధించి అసైన్డ్ ల్యాండ్  వారసత్వ మార్పు చేసి అర్హత పొందేవిధంగా చూడాలన్నారు. పట్టాలు ఇచ్చి పొజిషన్ చూపని వాటిని గుర్తించి లే  అవుట్ చేసి నంబరింగ్ ఇవ్వాలన్నారు. సంక్షేమ సంబరాలలో భాగంగా 2వ విడత గొర్రెల పంపిణి, వృతి కులాలకు లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అందించాలన్నారు. ఏ ఒక్క ఆరోగ్య ఉప కేంద్రం అద్దె భవనాల్లో, శిథిల భవనాల్లో ఉండకుండా అన్నిటి ప్రతిపాదనలు పంపితే, మూడు మాసాలలోగా నిర్మాణాలు  గావించాలన్నారు. మన ఊరు మనబడి పనులలో ఉమ్మడి జిల్లా ముందున్నదాను పనులు మరింత వేగవంతం చేసి విద్యా దినోత్సవం నాడు ప్రారంభించాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో మెదక్,  సిద్ధిపేట జిల్లా పరిషద్ చైర్ పర్సన్లు హేమలత శేఖర్ గౌడ్,  రోజా శర్మ, రాష్ట్ర మహిళా కమీషన్ చైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డి,  రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్  చింత ప్రభాకర్, మెదక్, సిద్ధిపేట    జిల్లా కలెక్టర్లు రాజర్షి షా,  ప్రశాంత్ జీవన్ పాటిల్, సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి, సిద్ధిపేట పోలీస్  కమీషనర్ శ్వేత, సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్, మెదక్, తూప్రాన్  డిఎస్పీలు  సైదులు, యాదవ రెడ్డి, పార్లమెంటు సభ్యులు  బిబి పాటిల్, ఎమ్మెల్సీ  శేరి సుభాష్ రెడ్డి, యాదవ రెడ్డి,  శాసనసభ్యులు పద్మా దేవేందర్ రెడ్డి,  మదన్ రెడ్డి, మాణిక్ రావు, చంటి  క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి, సతీష్, డిసిసిబి ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, గ్రంధాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, అసంఘటిత కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ దేవేందర్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, గడా ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి, అదనపు కలెక్టర్లు ప్రతిమ సింగ్, రమేష్, జిల్లా అధికారులు  తదితరులు పాల్గొన్నారు.