ఎఫ్ఎల్ఎన్ రాష్ట్ర స్థాయి బృందం పరిశీలన

ఎఫ్ఎల్ఎన్ రాష్ట్ర స్థాయి బృందం పరిశీలన
FLN State Level Team Observation

ముద్ర ప్రతినిధి, మెదక్: ఎఫ్ఎల్ఎన్ రాష్ట్ర స్థాయి బృందం బుధవారం పర్యటించింది. మెదక్ పట్టణం నవాబ్ పేట, గోల్కొండ, బాలుర ఉన్నత పాఠశాలలు, హవేలీ ఘనపూర్ మండలంలోని బూరుగుపల్లి ఉన్నత, ప్రాథమిక, రాజిపేట ప్రాథమిక పాఠశాలను సందర్శించి ఎఫ్ఎల్ఎన్ రికార్డులు, విద్యార్థుల ప్రగతిని పరిశీలించారు. ఉపాధ్యాయులకు సలహాలు, సూచనలు అందించారు.

రాష్ట్ర స్థాయి బృందం ప్రతినిధులు రాజిరెడ్డి, వరాల ప్రశాంత్ కుమార్, బృంగి ప్రసన్న, మండల విద్యాధికారి నీలకంఠం, మెదక్ మండల నోడల్ అధికారి వర ప్రసాద్, హవేలీ ఘనపూర్ నోడల్ అధికారి మధుమోహన్, జిల్లా రిసోర్సు పర్సన్ రామకృష్ణ పాల్గొన్నారు.