మెదక్ ఎంసిహెచ్ తనిఖీ లో భాగంగా కెసిఆర్ కిట్ సేవలపై కలెక్టర్ రాజర్షి షా ఆరా.. | Mudra News

మెదక్ ఎంసిహెచ్ తనిఖీ లో భాగంగా కెసిఆర్ కిట్ సేవలపై కలెక్టర్ రాజర్షి షా ఆరా.. | Mudra News

ముద్ర ప్రతినిధి' మెదక్: మెదక్ మాత, శిశు ఆసుపత్రి (ఎంసిహెచ్)ని కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. కేసిఆర్ కిట్ పై ఆరా తీశారు. కాన్పు అయిన వెంటనే కేసిఆర్ కిట్ ఎందుకు ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వివరాలు నమోదు కోసం ఆలస్యం అవుతుందని డాక్టర్ అరుణ నాయుడు తెలపగా...బేబీ పుట్టిన వెంటనే కిట్ ఇవ్వాలని కలెక్టర్ షా సూచించారు.  కేసిఆర్ కిట్ విషయంలో కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని విభాగాలు కలియతిరిగి పరిశీలించారు. అనంతరం అందుబాటులో ఉన్న సేవలు, మౌలిక వసతులు, అవసరాలపై సమీక్షించారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్, డిసిహెచ్ డా. పి. చంద్రశేఖర్, డిఎంహెచ్ఓ డా. చంద్రు నాయక్, డిజిఓ హెడ్ డా. శివ దయాళ్, మున్సిపల్ కమీషనర్ జానకిరామ్ సాగర్, తహసీల్దార్ శ్రీనివాస్ ఇతర అధికారులున్నారు.