టీఎస్పిఎస్సి బోర్డు సభ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

టీఎస్పిఎస్సి బోర్డు సభ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

*టీపీసీసీ సభ్యులు మామిళ్ల ఆంజనేయులు డెమాండ్*

*ముద్ర ప్రతినిధి, మెదక్:*

గ్రూప్స్ పేపర్ లీకేజీతో రెండు లక్షల మంది నిరుద్యోగులకు అన్యాయం చేసిన టి ఎస్ పి ఎస్ సి బోర్డు సభ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందని టీపీసీసీ సభ్యులు మామిళ్ల ఆంజనేయులు పేర్కొన్నారు. నిరుద్యోగ నాయకులుగా రాజకీయాల్లోకి వచ్చిన బాల్క సుమన్ లాంటి నాయకుడు నోరు మెదపకపోవడం సిగ్గుచేటన్నారు. 

తెరాస విద్యారి నాయకులు నిరుద్యోగులకు సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

9 సంవత్సరాలలో ఉద్యోగాలు భర్తీ చేయని ప్రభుత్వం కేవలం ఎన్నికల కోసం నోటిఫికేషన్ డ్రామా ప్రభుత్వమే ఆడుతుందన్నారు.

బోర్డు సభ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. ప్రభుత్వం నిరుద్యుగులకు క్షమాపణ చెప్పాలన్నారు. 

తక్షణమే నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగులు

బిఆర్ఎస్ నాయకులను

తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. మెదక్ పట్టణ అధ్యక్షులు

గూడూరి ఆంజనేయులు గౌడ్,

కౌన్సిలర్ రాజలింగం 

జిల్లా ఎస్సి సెల్ అధ్యక్షులు

సారా శామ్ సుందర్,

హవెల్లి ఘన్పూర్ అధ్యక్షులు

లక్కర్సు శ్రీనివాస్,

ఇస్మాయిల్, ప్రభాకర్ ఉన్నారు.