ఆడబిడ్డగా ఆదరించండి.. అభివృద్ధి కొనసాగిస్తా మెదక్ బిఆర్ఎస్ అభ్యర్థి పద్మ దేవేందర్ రెడ్డి ప్రచారం

ఆడబిడ్డగా ఆదరించండి.. అభివృద్ధి కొనసాగిస్తా మెదక్ బిఆర్ఎస్ అభ్యర్థి పద్మ దేవేందర్ రెడ్డి ప్రచారం

ముద్ర ప్రతినిధి, మెదక్: ఆడబిడ్డగా ఆదరించండి... అభివృద్ధి కొనసాగిస్తానని మెదక్ బిఆర్ఎస్ అభ్యర్థి ఎం. పద్మ దేవేదర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం హవెలి ఘనపూర్ మండలం గాజిరెడ్డిపల్లి, గాజిరెడ్డిపల్లి తండా, బూరుగుపల్లి, రాజపేట్ తండా, పోచమ్మరల్, పోచమ్మరల్ తండా, సుల్తాన్ పూర్, సుల్తాన్ పూర్ తండా, జక్కన్నపేట్, సర్దన, చౌట్లపల్లి, చౌట్లపల్లి తండాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.  గాజిరెడ్డిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డికి బోనాలు, మంగళహారతులతో మహిళలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ మరొకసారి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.  కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, యువత బీఆర్ఎస్ పార్టీలో చేరగా గులాబీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, జడ్పిటిసి సుజాత శ్రీనివాస్ రెడ్డి, ఈ కార్యక్రమంలో సర్పంచ్ భాగ్యలక్ష్మి శ్రీనివాస్, వార్డు మెంబర్లు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 గాజిరెడ్డిపల్లి తండాలో పద్మకు బ్రహ్మరథం పట్టారు. 

బూర్గుపల్లిలో పద్మ దేవేందర్ రెడ్డికి బోనాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలోని పెద్దమ్మ తల్లి ఆలయంలో పద్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు.  మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చెన్నా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వాడి గ్రామానికి చెందిన కాంగ్రెస్ మహిళలు రాజమణి, పుష్పమాల, లక్ష్మి, సత్యవ్వ, పోచమ్మ, ఎల్లమ్మ, బుధవ్వ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  మళ్లీ ఆమెనే గెలిపిస్తామని ప్రకకటించారు. 

మెదక్ మున్సిపాలిటీ 19వ వార్డుకు చెందిన నాయకుడు బోయిని విక్రమ్  బీఆర్ఎస్ లో చేరారు. పార్టీ రాష్ట్ర నాయకులు, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ కంఠారెడ్డి తిరుపతి రెడ్డి, మెదక్ టౌన్ ఇంచార్జ్ చిన్న, మెదక్ పట్టణ పార్టీ అధ్యక్షులు గంగాధర్, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. మండలంలోని రాజపేట్ గ్రామానికి చెందిన యువకులు శ్రీకర్, ప్రవీణ్, అరవింద్, చంద్రయ్య, బోయిని దత్తు, మల్లేశం, సాయిబాబా, కిష్టయ్య ,చింతకుంట మల్లేశం సహ పలువురు బీఆర్ఎస్‌లో చేరారు.