కాంగ్రెస్ కు ఓటు వేస్తే కారు చీకట్లే

కాంగ్రెస్ కు ఓటు వేస్తే కారు చీకట్లే
  • కాంగ్రెస్‌ అంటేనే మోసం దగా..
  • పంజా విసురతా అంటున్న ముసలిపులుల తో అయ్యేదేం లేదు
  • టైగర్ల ఆటలు సూర్యాపేటలో సాగనివ్వను
  • బీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం
  • రా బోయే డ్రై పోర్ట్ తో సూర్యాపేట ఆర్థిక ముఖచిత్రమే మారబో పోతుంది
  • లింగమంతుల స్వామి ఉర్లుగొండ గుట్టల మధ్య రోప్ వే 
  • రాబోయే టూరిస్ట్ హబ్ తొ ఉర్లుగొండ, వల్లభాపురం గుంపుల, తిరుమలగిరి, గుంజలూరు,తండాలకు గ్రామాలకు నూతన శోభ
  • తలరాతను నిర్ణయించే ఓటును సరైన పద్ధతిలో వినియోగించుకోవాలి
  • ఆశీర్వదించండి అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటా

 ముద్ర చివ్వేంల : కాంగ్రెస్ కు ఓటు వేస్తే కారు చీకట్లు.. బిఆర్ఎస్ కు ఓటు వేస్తే సంక్షేమ పథకాలు వస్తాయని రాష్ట్ర మంత్రి సూర్యాపేట టిఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలోని చివ్వెంల మండలం జగన్ తండా, ఉర్లుగొండ ,గుంపుల, తిరుమలగిరి, గ్రామాలల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అభివృద్ధి ప్రదాతకు నివాళులు హారతులతో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్‌ అంటేనే మోసం దగా అన్నారు. దామోదర్ రెడ్డి పాలనలో సమయపాలన లేని కరెంటుతో మోటర్లు కాలిపై రైతులు ఇబ్బందులు పడ్డారనీ అన్నారు.సూర్యాపేటకు తాము చేశాం అని చెప్పుకునే ఏ ఒక్క  అభివృద్ధి కార్యక్రమాన్నైనా కాంగ్రెస్ నాయకులు చెప్పగలరా అని సవాల్ విసిరిన మంత్రి, సూర్యాపేటలో జిల్లా చేసినా, మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినా, ట్యాంక్ బండ్ చేసిన, కాలేశ్వరం జలాలతో వరుసగా నాలుగుఏళ్లుగా రెండు పంటలకు నీళ్లు తీసుకువచ్చినా, 24 గంటల కరెంటు వచ్చినా అది జగదీష్ రెడ్డే అని శాశ్వతంగా గుర్తుండిపోయేలా అభివృద్ధి చేశారన్నారు.పంజా విసురతా అంటున్న ముసలిపులుల తో అయ్యేదేం లేదన్నారు.టైగర్ల ఆటలు సూర్యాపేటలో సాగనివ్వనన్నారు.బీఆర్‌ఎస్‌తోనే  ప్రజలకు భరోసా అభివృద్ధి సాధ్యం అన్నారు. సూర్యాపేట ప్రజల ఇచ్చిన హామీలన్నీ నూటికి నూరు శాతం అమలు చేశానన్న మంత్రి, రాబోయే డ్రై పోర్ట్ తో సూర్యాపేట ఆర్థిక ముఖచిత్రమే మారబో పోతుంది అన్నారు.

లింగమంతుల స్వామి ఉర్లుగొండ గుట్టల మధ్య రోప్ వే నిర్మించడమే కాకుండా, గుట్టల పరిషత్ పరిసర ప్రాంతాల్లో ఉన్న చెరువుల మధ్యలో అందమైన బోట్ హౌస్ నిర్మించి పర్యాటకు స్వర్గధామంగా తీర్చి దిద్దుతామన్నారు.రాబోయే టూరిస్ట్ హబ్ తొ ఉర్లుగొండ, వల్లభాపురం గుంపుల, తిరుమలగిరి, గుంజలూరు, తండాలకు గ్రామాలకు నూతన శోభ రావడమే కాదు ఇక్కడ భూముల రేట్లు కూడా పెరుగుతాయని అన్నారు.

తలరాతను నిర్ణయించే ఓటును సరైన పద్ధతిలో వినియోగించుకోవాలనికోరారు. పొరపాటున కాంగ్రెస్ కు ఓటేస్తే ఊర్లు వల్లకాడులు కావడం ఖాయం అన్నారు. డాగులు వేయడానికి టైగర్  ను కాదన్న మంత్రి నేను ప్రజాసేవకుడిని మాత్రమే అన్నారు. పదివేల మంది యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా పారిశ్రామిక హబ్, మూడువేలమంది ఉద్యోగులకు ఐటి పరిశ్రమను విస్తరించడమే భవిష్యత్తు లక్ష్యం అన్నారు. మరోసారి ఆశీర్వదిస్తే తనకు ఓటు వేసిన వాళ్ళు తలెత్తుకొని గర్వపడేలా అభివృద్ధి చేస్తానని మంత్రి కోరారు.