అనంతగిరి ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన అనిల్ రెడ్డి...

అనంతగిరి ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన అనిల్ రెడ్డి...

కోదాడ, ముద్ర : అనంతగిరి ఎస్సైగా ఎం. అనిల్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన సత్యనారాయణ కొన్ని నెలలు సెలవులపై వెళ్లడంతో ఆయన స్థానంలో ఇన్చార్జి ఎస్సై గా ఐలయ్య కొనసాగారు. ప్రస్తుతం సత్యనారాయణను నల్లగొండ విఆర్ కు బదిలీ చేయడంతో ఆయన స్థానంలో కేతపల్లిలో విధులు నిర్వహిస్తున్న అనిల్ రెడ్డి ఇక్కడికి వచ్చారు.

ఈ సందర్భంగా నూతన ఎస్సై అనిల్ రెడ్డి మాట్లాడుతూ... మండలంలో శాంతి భద్రత పరిరక్షణలో ప్రజల సహకరించాలని కోరారు. అనంతరం పలువురి సిబ్బంది ఎస్సై కి పుష్ప గుచ్చాలు అందజేసే శుభాకాంక్షలు తెలియజేశారు.