అంగన్వాడి కేంద్రాలను  నిరంతరం పర్యవేక్షణ చేయాలి 

అంగన్వాడి కేంద్రాలను  నిరంతరం పర్యవేక్షణ చేయాలి 

ఐదవ స్థాయి సంఘం చైర్ పర్సన్  చింతా రెడ్డి చంద్రకళ

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట:సూర్యాపేట, అంగన్వాడీ కేంద్రాలను  నిరంతరం పర్యవేక్షణ చేయాలని, వాటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఐదవ స్థాయి సంఘం మహిళా శిశు సంక్షేమం  ఛైర్ పర్సన్ చింతారెడ్డి చంద్ర కళ అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఐదవ స్థాయి సంఘం ఛైర్ పర్సన్   అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సందర్భంగా  మాట్లాడుతూ సిడిపివోలు, సూపర్వైజర్లు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ  సరైన పోషకాహారం అందించి పిల్లల ఆరోగ్య సాయని మెరుగుపరచేందు కృషి చేయాలని తెలిపారు.

అంగన్వాడి కేంద్రాలు చిరుధాన్యాల పెరడును ప్రోత్సహించవలెనని పేర్కొన్నారు. చిరుధాన్యాల ప్రాధాన్యత అవగాహన కల్పించి బాల్య వివాహాలను  అరికట్టాలని అందుకుగాను 1098 నెంబర్ కు ఫోన్ చేసి వివరములు అందించాలని సూచించారు. జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి జి, సురేష్ , జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి జ్యోతి పద్మ,డీఆర్డీఏ అడిషనల్ పిడీసంజీవరావు,  జిల్లా ప్రాదేశిక నియోజకవర్గం సభ్యురాలు  మద్దిరాల  కన్నా సురాంబ,  ఐదో స్థాయి సంఘంకు సంబంధించిన  జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.