ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం

ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం
  • నిరుపేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడు
  • ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

హుజూర్ నగర్ ,టౌన్, ముద్ర:ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని, తెలంగాణ రాష్ట్రంలోని  నిరుపేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడు అని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గరిడేపల్లి మండలం కేతవారిగూడెం గ్రామానికి చెందిన చన్న గాని సుజాత 20,000 ,కడప వెంకటయ్య 20,000,కీతారామనరసమ్మ 2,00,000 రూపాయల సీఎం సహాయనిధి, చికిత్స కొరకు మంజూరైన చెక్కులను బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే శానంపూడి  సైదిరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమ కోసం పూర్తి భరోసా కల్పిస్తుందని అన్నారు. సీఎం సహాయనిధి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది నిరుపేదల ప్రాణాలు నిలబడ్డాయని ,ప్రాణ పాయ స్థితిలో ఉన్న బాధితులను కాపాడేందుకు ప్రభుత్వం  చికిత్స కొరకు ఈ రుణాలను అందజేస్తున్నదని ఆయన తెలిపారు. ప్రమాదవశాత్తు గాయపడిన బడుగు, బలహీన, మధ్యతరగతి, పేదల కొరకు కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్య సేవలనుప్రభుత్వం అందిస్తుందని అన్నారు.కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ గౌడ్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి, సర్పంచ్ కీత జ్యోతి రామారావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెడమర్తి అంజి, బండారు బిక్షం తదితరులు పాల్గొన్నారు.