తుంగతుర్తి ప్రాంతంలో వర్ష బీభత్సం

తుంగతుర్తి ప్రాంతంలో వర్ష బీభత్సం
  • నీట మునిగిన పంట పొలాలు పొంగిపొర్లుతున్న వాగులు వంకలు
  • తుంగతుర్తి గ్రామ సమీపంలోని పెద్ద చెరువు వద్ద  .రోడ్డుపై భారీగా వెళుతున్న వరద నీరు- రాకపోకలు బంద్
  • బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఎక్కడ చూసినా వరద ప్రవాహాలే
  • వరి ,పత్తి పంటలు పాడవుతాయని ఆందోళన చెందుతున్న రైతులు
  • తుంగతుర్తి మండల కేంద్రంలో ఇంటిపై కూలిన భారీ వృక్షం

తుంగతుర్తి ముద్ర: గత పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల తుంగతుర్తి నియోజకవర్గం లోని పలు గ్రామాల చెరువులు కుంటలు నిండి పొంగిపొర్లుతుండగా వివిధ గ్రామాల మధ్యన ప్రవహిస్తున్న వాగులు వంకలు నీటి ప్రవాహాలతో ఉదృతంగా ప్రవహిస్తున్నాయి .వివిధ గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి .తుంగతుర్తి మండల కేంద్రం నుండి వెలుగు పెళ్లి మీదుగా సూర్యాపేటకు వెళ్లే రోడ్డు తుంగతుర్తి సమీపంలో పెద్ద చెరువులోకి ప్రవహిస్తున్న భారీ వరదనీటి కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గత వారం రోజులుగా వెలుగు పెళ్లి కేశవాపురం బంధం సంగం కోడూరు బంధంల వరద ప్రవాహాల కారణంగా ఆయా గ్రామాల రైతులు ఎటు వెళ్లలేక నానా ఇబ్బందులు పడుతున్నారు.

బుధవారం రాత్రి గాలులతోపాటు భారీ వర్షం కురియడం తో తుంగతుర్తి మండల కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మండల కేంద్రంలోని పూలగడ్డ ప్రాంతంలో గాలి గాలివానకు వేపచెట్టు కూకటి వేళ్ళతో కూలి పక్కనే ఉన్న ఇంటి పై పడింది కాగా ఇంటిలోని వారికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. రైతులు తమ పొలాలకు వెళ్లడానికి ఎటు చూసినా రోడ్లపై ప్రవహిస్తున్న వరద ప్రవాహాలే కానవస్తున్నాయి .ఇటీవల కొంతమంది రైతులు డ్రమ్ సిడర్ ద్వారా అలాగే వెదజల్లే పద్ధతిలో వరి విత్తనాలు సాగు చేశారు .కొంతమంది రైతులు నాట్లు వేశారు. అటు వరి నాట్లు ఇటు విత్తనాలు చల్లిన రైతులకు భారీ నష్టం ఏర్పడిందని రైతాంగం అంటుంది. పది రోజులుగా పొలాలపై వరద నీరు ప్రవహిస్తుంటే వరిచేలు పాడైపోగా పత్తి చేలలో నీరు నిలిచి అవకాశాలు ఉన్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి సాగు చేసిన వారి పత్తిపైర్లు కళ్ళముందుటే పాడవుతుంటే చేసేదేమీ లేక రైతులు తీవ్ర విచారం వ్యక్తం .చేస్తున్నారు ఒక్కో గ్రామంలోని చెరువులో అలుగుల మోత తో దద్దరిల్లుతున్నాయి .మున్నెన్నడు చూడని విధంగా చెరువుల అలుగులు పోస్తున్నాయని ప్రజలు అంటున్నారు .తుంగతుర్తి మండలం లో ఇంత భారీగా వర్షాలను  ఎన్నడూ చూడలేదని వయసు మళ్ళిన వారు చెబుతున్నారు .ఏది ఏమైనా కురుస్తున్న భారీ వర్షాలు మున్ముందు ఏ పెను ప్రమాదానికి కారణమవుతాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  ప్రజలు ఎవరు అనవసరంగా ప్రయాణాలు చేయవద్దని వరద ప్రవాహాల ప్రాంతానికి వెళ్లవద్దని ఒకపక్క అధికారులు పోలీస్ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. మరి ఈ వర్షం ఇంకెన్నాళ్లు ఉంటుందో మునుముందు ఏమి జరుగనుందో వేచి చూడాల్సిందే.