కోదాడ బిఆర్ఎస్ అభ్యర్థిగా మరో సారి సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లం. మల్లయ్య యాదవ్

కోదాడ బిఆర్ఎస్ అభ్యర్థిగా మరో సారి సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లం. మల్లయ్య యాదవ్

ముద్ర,కోదాడ:-కోదాడ బిఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లం. మల్లయ్య యాదవ్ కు రెండవసారి టికెట్ లభించింది . 2018 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో స్థానిక కాంగ్రేస్ అభ్యర్థిని ఉత్తమ్ పద్మావతి పై 736 ఓట్లు తేడాతో గెలుపొందాడు . తిరిగి మరోసారి బిఆర్ఎస్ అభ్యర్థిగా టికెట్ సాధించిన మల్లయ్య యాదవ్ 1965 ఆగష్టు 14 న వీరయ్య , వీరమ్మ దంపతులకు జన్మించాడు . ఇతని స్వస్థలం కోదాడ నియోజకవర్గం లోని నడిగూడెం మండలం కరివిరాల గ్రామం . 1992 లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ పూర్తీ చేసాడు . అనంతరం ఇందిరతో వివాహం జరుగగా వీరికి ఇద్దరు కుమారులు , ఒక కుమార్తె సంతానం . మల్లయ్య యాదవ్ 2009లో కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి 13,544 ఓట్లతో నాల్గవ స్థానంలో నిలిచాడు. 2012లో తెలుగుదేశం పార్టీలో చేరాడు. పార్టీలో చురుగ్గా పనిచేసి సీనియర్ లీడర్ గా ఎదిగి కొంతకాలం టీడీపీ పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేశాడు. అలాగే కోదాడ నియోజకవర్గం ఇంచార్జ్‌గా కూడా పనిచేశాడు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కోదాడగ అసెంబ్లీ స్థానానికి పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నలమడ పద్మావతి చేతిలో 13,437 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆ తరువాత టిడిపి పార్టీని విడిచిపెట్టి టిఆర్ఎస్ పార్టీలో చేరాడు. ఇప్పటికె ఒక సారి ఎమ్మెల్యేగా ప్రజలకు చేరువైన మల్లయ్య యాదవ్ మరోసారి బిఆర్ఎస్ నుండి అవకాశం రావడంతో బిఆర్ఎస్ కార్యకర్తలలో , మల్లయ్య అభిమానులలో ఆనందం వెల్లివిరిసింది .