G.o నెంబర్ 46ను రద్దు చేయాలి

G.o నెంబర్ 46ను రద్దు చేయాలి
  • ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం లో సైతం పోలీస్ ఉద్యోగాలలో అన్యాయానికి గురవుతున్న అభ్యర్థులు
  • రాపోలు నవీన్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ సూర్యాపేట జిల్లా ఇంచార్జి

పాలకీడు,ముద్ర:-G.o నెంబర్ 46ను రద్దు చేయాలని రాపోలు నవీన్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. G.o 46 వల్ల ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు 53% రిజర్వేషన్ కల్పించి మిగతా జిల్లాలకు 47% కేటాయించడం వల్ల ఖమ్మం,ములుగు ఆదిలాబాద్,సూర్యాపేట, ఇంకా కొన్ని జిల్లాల లాంటి గ్రామీణ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. జీ.వో వల్ల హైదరాబాద్ జిల్లాలో 80 ప్లస్ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగం అవకాశం వస్తుందని, మిగతా జిల్లాల లోపల 120 మార్కులు వచ్చినా కూడా ఉద్యోగం రాని పరిస్థితి ఉన్నదని దీనివల్ల దక్షిణ తెలంగాణ జిల్లాలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. 2016, 2018 లో జీవో నెంబర్ 46 అమలు చేయకుండా నియామకాలు జరిపారు. ప్రస్తుతం కూడా జీవో నెంబర్ 46 ను రద్దు చేసి రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి నియామకాలు కాబట్టి రాష్ట్ర స్థాయిలోనే కటాఫ్ మార్కులు ఉండాలని అన్నారు. నియామకాలు మాత్రం జిల్లాల వారీగా చేపట్టి ఉద్యోగాలు మాత్రం రాష్ట్రస్థాయిలో చేయాలనడం ఎంతవరకు సబబు అని అయన a అన్నారు.కేవలం సూర్యాపేట జిల్లా నుండి 6000 మంది అభ్యర్థులు, నల్గొండ నుండి 7900 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి అటెండ్ కావడం మొత్తం 97,000 మంది ఉంటే ఉమ్మడి నల్గొండ జిల్లా లో 13000 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి అటెండ్ అవ్వడం జరిగింది అని  పోలీసు అభ్యర్థులు మెయిన్స్,ఇంటర్వ్యూస్ ఈవెంట్స్ అన్ని పూర్తి చేసుకొని సర్టిఫికెట్ల పరిశీలన తర్వాత ఆయా జిల్లాలకు ఉద్యోగాల పర్సెంటేజ్ ప్రకటించడం అన్యాయమని అన్నారు.TSSP నిర్వహించిన కానిస్టేబుల్ నియామకంలో  సిలబస్ ప్రకారం కాకుండా తెలంగాణ చరిత్ర, జాగ్రఫీ గూర్చి  ప్రశ్నలు లేకపోవడం విస్మయం కలిగిస్తుందని అన్నారు.ఈ 46 జీవో వల్ల హైదరాబాద్ మినహాయించి మిగతా జిల్లాలకు అన్యాయం జరుగుతుందని, ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 46 ను రద్దుచేసి దక్షిణ తెలంగాణ జిల్లాలకు న్యాయం జరిగేలా పాత పద్ధతి లోనే నియామకాలు జరపాలి అదిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.