మందు షాపులకు రిజర్వేషన్ల ఖరారు

మందు షాపులకు రిజర్వేషన్ల ఖరారు
  • కోదాడ డివిజన్ లో మొత్తం షాపులు 24

ముద్ర ప్రతినిధి , కోదాడ:-తెలంగాణ లో మందు షాపులకు లైసెన్స్ గడువు మరో మూడు నెలలు సమయం ఉండగానే ఖజానా నింపుకునేందుకు మూడు నెలల ముందు ప్రభుత్వం గతంలో మాదిరిగానే మరోసారి టెండర్లను ఆహ్వానిస్తుంది . రెండు లక్షల రూపాయల నాన్ రిఫండబుల్ డిడి తో పాటు సంబంధిత పత్రాలతో ఆబ్కారీ శాఖ వారికి అప్లై చేసుకునేందుకు 4 వ తారీకు నుండి 18 వ తారీకు వరకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 21 న లక్కీ డ్రా ద్వారా దుకాణాలను కేటాయిస్తారు . దీని కోసం ప్రభుత్వం కేటాయించిన రిజర్వేషన్లను సూర్యాపేట జిల్లా కలెక్టర్ శుక్రవారం ఖరారు చేశారు . కోదాడ డివిజన్ పరిధిలో మొత్తం 24 షాపులు ఉండగా అనంతగిరి వైన్స్ - (065) ఎస్సీ లకు కేటాయించగా , పట్టణ పరిధిలోని 048 , 50 , 54 , 56 , 58 షాపులు గౌడ లకు , నల్లబండ గూడెం 059 , మునగాల 067 , బరాకత్ గూడెం 069 షాపులు కూడా గౌడ కులస్తులకు రిజర్వేషన్ కేటాయించగా మిగతా 049 , 51,52,53,55,57,60,61,62,63,64,66,68,70,71 లు జనరల్ కు కేటాయించటం జరిగినదని జిల్లా ఎక్సయిజ్ & ప్రొహిబిషన్ అధికారిణి అనిత ఒక ప్రకటన విడుదల చేశారు . జిల్లా వ్యాప్తంగా మొత్తం 99 షాపులకు గాను ఎస్సీ లకు 10 , గౌడలకు 27 , ఓపెన్ కేటగిరి 59 షాపులు కేటాయించినట్లు తెలిపారు .