తెలంగాణ జాతిపిత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం దివ్యాంగులకు 4016 రూపాయల పెన్షన్ ప్రొసీడింగ్స్ అందచేసిన ఎమ్మెల్యే

తెలంగాణ జాతిపిత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం దివ్యాంగులకు 4016 రూపాయల పెన్షన్ ప్రొసీడింగ్స్ అందచేసిన ఎమ్మెల్యే
  • ప్రధాని నరేంద్ర మోడీ
  • సొంత రాష్ట్రంలో రాష్ట్రంలో కూడా లేనంత పెన్షన్ అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్
  • తుంగతుర్తి నియోజకవర్గంలో 94 వేల కుటుంబాలు ఉండగా49797 కుటుంబాలకు వస్తున్న పెన్షన్లు
  • 6000 మంది దివ్యాంగులకు సుమారు ఒక కోటి 78 లక్షల రూపాయలు నియోజకవర్గ వ్యాప్తంగా అందుతున్న పెన్షన్
  • రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళలో అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజలు మరోసారి అండగా నిలవాలి
  • తుంగతుర్తి నియోజకవర్గంలో గులాబీ జెండాను ప్రజలు రెపరెపలాడించాలి
  • రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమాలు చూసి డీలా పడిన విపక్షాలు
  • ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్
  • వెలుగు పల్లి పాఠశాలలో 58 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

తుంగతుర్తి ముద్ర:-తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి జాతిపిత కెసిఆర్ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుల పెన్షన్లను 2014 నుండి 2023 వరకు అంచలంచలుగా పెంచుతూ ప్రస్తుతం 3016 రూపాయల నుండి 1000 రూపాయలు అదనంగా పెంచుతూ 4016రూపాయలుగా పెంచారని తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు. శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని సిరి ఫంక్షన్ హాల్ లో దివ్యాంగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెంచిన 4016 రూపాయల పెన్షన్ ప్రొసీడింగ్స్ ను దివ్యాంగులకు అందించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకుల హయాంలో పెన్షన్లు 70 రూపాయల నుండి 200 రూపాయల వరకు ఆసరా పెన్షన్ ఉండగా దివ్యాంగులకు 500 రూపాయలు మాత్రమే ఉండేదని కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగులు స్వతంత్రంగా బతకగలగాలని 2014లో 1500 రూపాయలు, 2018లో 3016 ,2023లో ఏకంగా 4016 రూపాయలకు ,పెంచి దివ్యాంగులను ఆదుకున్న గొప్ప వ్యక్తి కేసీఆర్ అని అన్నారు .దేశంలో మరే రాష్ట్రంలో తెలంగాణలో మాదిరిగా పెన్షన్లు లేవని ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో దివ్యాంగులకు ₹1000 పెన్షన్ బిజెపి తో కూడిన మహారాష్ట్రలో దివ్యాంగులకు 600 పెన్షన్, కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో 1000 పెన్షన్ ,ఒరిస్సాలో 300 రూపాయలే ఇస్తున్నారని కానీ దేశంలో 4016 రూపాయలు దివ్యాంగులకు పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్ర కేవలం తెలంగాణలో అది ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో అని అన్నారు.

తుంగతుర్తి నియోజకవర్గంలో సుమారు రెండు లక్షల  36 వేల మంది ఓటర్లు ఉండగా 92 వేల కుటుంబాలు ఉన్నాయని వీటిలో 49 797 మందికి పెన్షన్లు వస్తున్నాయని అనగా దాదాపు సగం కుటుంబాల వారికి పెన్షన్లు అందుతున్నాయని ఇది కేసీఆర్ చేసిన సంక్షేమం కాదా అని ప్రశ్నించారు. ప్రస్తుతం పెంచిన దివ్యాంగుల పెన్షన్ రోజుకు 130 రూపాయలు అవుతున్నాయనీ 40 16 రూపాయలు దివ్యాంగుల పోషణకు సరిపోతుందని అన్నారు .తుంగతుర్తి నియోజకవర్గంలో సుమారు 6000 మందికి పైగా దివ్యాంగుల పెన్షన్లు అందుతున్నాయని సుమారు ఒక కోటి 78 లక్షల రూపాయలు వారికి అందుతున్నాయని అన్నారు .దివ్యాంగులకు స్వతంత్రంగా బ్రతికే సామర్థ్యం కోసం కేసీఆర్ పెన్షన్ పెంచారని అన్నారు .కెసిఆర్ పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి అభివృద్ధి సంక్షేమ పథకాలు రాజకీయాలకి అతీతంగా అందుతున్నాయని అన్నారు .ఇటీవలనే 19 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశారని ,స్థలమున్నవారికి గృహలక్ష్మి పథకం కింద మూడు లక్షలు అందజేయనున్నట్లు తెలిపారు. తుంగతుర్తి నియోజకవర్గంలో 3000 గృహాలు మంజూరి అయ్యాయని అన్నారు .దళిత బంధు ,బీసీ బందు లాంటి పథకాలు దేశంలో మరెక్కడా లేవని అన్నారు .

రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసిన విపక్షాలు ఇప్పటికే గెలుపు పై ఆశలు సన్నగిల్లి నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతూ ఆ వాకులు చావాకులు పేలుతున్నారని అన్నారు .తుంగతుర్తి నియోజకవర్గం ప్రజలు అభివృద్ధి కోరేవారని అందుకే తనను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని అన్నారు .వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను గెలిపించాలని అలాగే తుంగతుర్తి నుండి తనకు అండగా  నిలిచి గులాబీ జెండాను గెలిపించాలని అన్నారు .సమావేశం అనంతరం దివ్యాంగులకు పోసీడింగ్స్ అందజేశారు. అనంతరం మండల పరిధిలోని వెలుగు పల్లి గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో 58 లక్షల రూపాయలతో నిర్మాణం కానున్న భోజనశాలకు రెండు తరగతి గదులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు, పిడి కిరణ్ కుమార్, డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, జిల్లా కోఆర్డినేటర్ రజాక్ ,నూతనకల్ మండలం జడ్పిటిసి కందాల దామోదర్ రెడ్డి, ఎంపీపీ కవిత, వైస్ ఎంపీపీ శ్రీశైలం, మద్దిరాల జడ్పిటిసి సూరాంబా, తహసిల్దార్ యాదగిరి రెడ్డి, ఎంపీడీవో భీమ్ సింగ్ ,వెలుగుపల్లి సర్పంచ్ వెంకన్న, ఎంపీటీసీ కవిత ,మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య, గుండగాని రాములు గౌడ్ ,కటకం వెంకటేశ్వర్లు ,చెరుకు సృజన పరమేష్, గోపగాని రమేష్ ,గోపగాని శ్రీను ,వికలాంగుల సంఘం రాష్ట్ర నాయకులు మల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.