కుష్టు వ్యాధిగ్రస్తుల సర్వే పకడ్బందీగా నిర్వహించాలి

కుష్టు వ్యాధిగ్రస్తుల సర్వే పకడ్బందీగా నిర్వహించాలి
  • డిప్యూటీపారామెడికల్ అధికారి మాతంగి సురేష్ బాబు

హుజూర్ నగర్ టౌన్ ముద్ర:కుష్టు వ్యాధి నివారణకు వ్యాధిగ్రస్తుల సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని డిప్యూటీ పారామెడికల్ అధికారి మాతంగి సురేష్ బాబు అన్నారు. గురువారం పట్టణంలో నిర్వహిస్తున్న కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఇంటింటి సర్వేను పరిశీలించి మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు ఈనెల 31 వరకు ఇంటింటికి తిరిగి చర్మంపై స్పర్శ లేని రాగి వర్ణపు మచ్చలు వున్నవారిని గుర్తించాలని ఆదేశించారు. మండలంలోని ప్రజలు, ఆశా కార్యకర్తలకు సహకరించాలని కోరారు. కుష్టు వ్యాధిని సకాలంలో గుర్తిస్తే అంగవైకల్యం రాకుండా కాపాడవచ్చన్నారు. కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ ఇందిరాల రామకృష్ణ, ఆశా కార్యకర్తలు నిర్మల,నాగేంద్ర,ఇందిర తదితరులు పాల్గొన్నారు.