ఆకాశాన్ని అంటుతున్న కూరగాయ ధరలు

ఆకాశాన్ని అంటుతున్న కూరగాయ ధరలు
  • సెంచరీ దాటిన టమాటా ధర
  • డబుల్ సెంచరీ వైపు పరుగులు తీస్తున్న మిర్చి
  • కూరగాయలు కొనలేని స్థితిలో ఉన్నామంటున్న సామాన్యులు
  • కిలో పచ్చిమిర్చి ధర 200 రూపాయలు కిలో టమాట ధర100 రూపాయలు
  • మిగతా అన్ని రకాల కూరగాయలు 100కు చేరువలోనే  

తుంగతుర్తి ముద్ర:-మార్కెట్లో కూరగాయ ధరలు చుక్కలు నంటుతుండడంతో వినియోగదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు .కిలో టమాటా ధర ఇప్పటికే వంద దాటింది కిలోమీటర్ 150 పైగా పలుకుతుంది గ్రేడ్ వన్ టమాటా 120 గ్రేడ్ వన్ మిర్చి 200 దాకా పలుకుతుంది.  రోజురోజుకి కూరగాయ ధరలు పెరుగుతున్నాయి తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. గతవారం 50 రూపాయలు పలికిన టమాట వారం రోజుల్లో 100కు చేరింది 120 రూపాయల కేజీ ఉన్న పచ్చిమిర్చి ధర వారం రోజుల్లో 200 చేరింది.మార్కెట్లో మిగతా కూరగాయ ధరలు ఏ రకం చూసిన 100రూపాయలకు కిలో పైనే ఉన్నాయి. దీంతో సామాన్యులు కూరగాయలు కొనే పరిస్థితి కనిపించడం లేదు. అనునిత్యం వంటలో ప్రధానంగా అందరూ ఉపయోగించే పచ్చిమిర్చి టమాటా ధరలు కొండెక్కడంతో పేద ప్రజలకు మరేం చేయాలో దిక్కుతోచడం లేదని అంటున్నారు .దొండ బెండ కాకర దోస గోరుచిక్కుడు తదితర కూరగాయల ధరలు మండుతుండడంతో సంతకు వెళ్లినవారు వట్టి చేతులతోనే ఇళ్లకు వెళ్లాల్సి వస్తుందని పలువురు అంటున్నారు. తుంగతుర్తి మండల కేంద్రంలో ప్రతి సోమవారం కూరగాయల సంత సాగుతుంది .ఈసారి సంతలో తమ దుకాణాల్లో కూరగాయలు కొన్న నాథుడే లేడని దుకాణదారులు అంటున్నారు.

కొందా మంటే తాము కొనలేని ధరలు ఉన్నాయని ప్రజలు అంటున్నారు .ఇలానే ఉంటే సామాన్యుడి బ్రతుకు దుర్భరం అవుతుంది అని అంటున్నారు .కూరగాయల ధరల కన్నా చికెన్ కోడిగుడ్ల ధరలు తక్కువగా ఉన్నాయని పలువురు అంటున్నారు.  శాఖాహారులు మాత్రం విధి లేని పరిస్థితుల్లో పావు కిలో చొప్పున కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు .రోజువారి కూలీలు తాము సంపాదించే కూలీ డబ్బులు కూరగాయలకే సరిపోవడంలేదని పరిస్థితులు ఇలాగే కొనసాగితే భోజనం సైతం సరిగా తినలేని పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు. ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలతో పేద మధ్యతరగతి కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . కూరగాయల తగ్గాలంటే ఆగస్టు నెల రావాల్సిందేనని పలువురు దుకాణదారులు అంటున్నారు.తీవ్ర వర్షాభావ పరిస్థితులు కూరగాయ ధరలు పెరగడానికి కారణమని పలువురు రైతులు కూరగాయ వ్యాపారులు అంటున్నారు కూరగాయలు పండిస్తున్న రైతులకు మాత్రంలాభ  సాటిగానే కనిపిస్తుంది .గతంలో టమాటా ధరలు కిలో రూపాయికి అమ్మామని అప్పుడు నష్టాలు వచ్చాయని ఇప్పుడు ధరలు పెరగడంతో కొంతమేర లాభం వస్తుందని అంటున్నారు.ఏది ఏమైనా కూరగాయ ధరలు తగ్గేదెనడో సామాన్య మధ్యతరగతి ప్రజల బాధలు పోయేదేనడు అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు