మణిపూర్ సంఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి. సిపిఐ

మణిపూర్ సంఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి. సిపిఐ
  • మహిళలపై దాడి. హత్యాచారం ఘటన ప్రజాస్వామ్యానికి ముప్పు
  • సిపిఐ జిల్లా నాయకులు సిహెచ్ సీతారాం

ముద్ర మునగాల:-గత కొద్ది రోజులుగా మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లు ,మూక దాడులు, మహిళలపై అరాచకాలు మొదలగు అంశాలను సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని సిపిఐ జిల్లా నాయకులు సిహెచ్ సీతారాం అన్నారు. గత మే నెలలో మణిపూర్ రాష్ట్రంలోని  .  కుక్కి తెగకు చెందిన ముగ్గురు మహిళలను వివస్త్రాలను చేసి తీవ్రంగా దాడి చేసిన అనంతరం అత్యాచారం చేసి ఇద్దరు మహిళలను చంపిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ. ఆదివారం మండల కేంద్రంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భారతదేశ చరిత్రలో మణిపూర్ సంఘటన ప్రజాస్వామ్యానికి తీరని మచ్చ లాంటిదని. నరేంద్ర మోడీ ప్రభుత్వ సారధ్యంలో తొమ్మిది సంవత్సరాలుగా దేశంలో మహిళలకు రక్షణ కరువైందని చెప్పటానికి మణిపూర్ సంఘటన ఉదాహరణగా నిలుస్తుందని. ఇంతటి తీవ్ర సంఘటన జరిగి గత రెండు నెలలు కావస్తున్న ఏమీ తెలవనట్లు దేశ ప్రజలను మోసగించుతూ నరేంద్ర మోడీ సారధ్యంలో మతతత్వ బిజెపి ప్రభుత్వం జరిగిన సంఘటనని దాచిపెట్టి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలు చేయటం సిగ్గుచేటని వారన్నారు. రాష్ట్రంలో గిరిజన తెగల మధ్య జరిగినటువంటి అల్లర్లకు కారణమైన వారిని, యువతులపై జరిపిన దాడులకు  కారకులైన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని, ఆ రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొల్పుటకై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి జక్కుల వీరశేఖర్. సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి కాసర్ల రాజేష్, ఏఐటీయూసీ మండల కార్యదర్శి సారెడ్డి రాఘవరెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జి శివ, ఏఐఎస్ఎఫ్ నాయకులు అమ రోజు శివ, అక్కినపల్లి సాయి, దీక్షిత్, ముస్తఫా, జగదీప్, తదితరులు పాల్గొన్నారు.