ప్రజారంజక పాలన అందిస్తున్న బీఆర్ఎస్ కు ప్రతి ఒక్కరు అండగా నిలవాలి

ప్రజారంజక పాలన అందిస్తున్న బీఆర్ఎస్ కు ప్రతి ఒక్కరు అండగా నిలవాలి
  • బీఆర్ఎస్ జిల్లా నాయకులు గండూరి కృపాకర్

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-ప్రజా రంజక పాలన అందిస్తున్న విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్ రెడ్డికు రానున్న ఎన్నికల్లో  ప్రజలు అండగా నిలవాలని బీఆర్ఎస్ జిల్లా నాయకులు, చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గండూరి కృపాకర్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో గండూరి కృపాకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 365 రోజుల అల్పాహార వితరణ కార్యక్రమంలో ఓరుగంటి సోమన్న పుట్టినరోజు సందర్భంగా అల్పాహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పాలన అందిస్తున్నారని అన్నారు. తెలంగాణ రైతులకు ఇప్పటికే లక్ష రూపాయల రుణమాఫీ చేయడంతో పాటు కు హక్కు పత్రాలు అందజేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించి రైతుల పక్షపాతిగా నిలిచారన్నారు. పిఆర్సి అమలుకు త్వరలోనే ఉద్యోగులకు తీపి కబురు చెప్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి పదివేల రూపాయల చొప్పున అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించి కార్మికుల పక్షపాతిగా నిలిచారని అన్నారు. ముస్లిం మత పెద్దలకు 7000 చొప్పున అందజేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి యావత్ ముస్లిం సోదరులు అండగా నిలవాలని కోరారు. అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లాను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్ రెడ్డి లకు రానున్న రోజుల్లో అన్ని వర్గాల ప్రజలు అండగా నిలిచి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని కోరారు.అనంతరం ప్రజా యుద్ధనౌక ప్రజా గాయకుడు గద్దర్ మరణం పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో గద్దర్ పోషించిన పాత్రను గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో రాచకొండ శ్రీనివాస్, సురక్ష క్లబ్ అధ్యక్షురాలు రమాదేవి, నామ వేణు, జూలకంటి నాగరాజు, తేలుకుంట్ల వెంకన్న, చంద్రమౌళి, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.