మణిపూర్ మారణ హోమం సిగ్గుచేటు

మణిపూర్ మారణ హోమం సిగ్గుచేటు

ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి

  ముద్ర ప్రతినిధి సూర్యాపేట: మణిపూర్ రాష్ట్రంలో గత 100 రోజులుగా మారణ హోమం జరుగుతున్న వాటిని అడ్డుకట్ట వేయడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ఆరోపించారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ జరిగిన ఐద్వా జిల్లా కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆమె మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న నేటికీ భారతదేశంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. గత 100 రోజులుగా మణిపూర్ రాష్ట్రంలో మరణ హోమం హోమం జరుగుతున్న  ప్రతిపక్షాలు పార్లమెంటు సాక్షిగా ఆందోళన చేస్తున్న ప్రధానమంత్రి నోరు మెదపకపోవడం సిగ్గుచేటు అన్నారు. మణిపూర్ రాష్ట్రంలో వందలకొద్దీ హత్యలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నందున ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాల్సి వచ్చిందని స్వయాన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం ఆ రాష్ట్ర బిజెపి పాలన వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించారు. మణిపూర్ రాష్ట్రంలో వందల కొద్ది ఘటనలు జరిగాయని ఆ ఘటనలో అనేకమంది అత్యాచారాలకు గురయ్యారని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం సిగ్గుచేటు అన్నారు.  ఆదివాసీ మహిళ అయినటువంటి రాష్ట్రపతి, దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తక్షణం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.గత మూడు నెలల నుండి మణిపూర్ లో మారణ హోమం జరుగుతుంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ  ఎన్నికల ప్రచారం, విదేశాలు తిరగడం  చేశారే తప్ప ఆ రాష్ట్రంలో  పర్యటించి శాంతిని నెలకొల్పలేక పోయారని విమర్శించారు. 

ప్రధాని ప్రారంభంలోనే స్పందించి ఉంటే ఇంతటి దారుణాలు వందల కొద్ది మరణాలు, మహిళలపై సామూహిక హత్యాచారాలు జరిగేవి కావని కావన్నారు. పార్లమెంట్ లో ప్రతిపక్షాలు నెత్తి నోరు మొత్తుకున్న ప్రధాని స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. కుకీ గిరిజన తెగకు సంబంధించిన ఒకరిని తల నరికి తడకకు వేలాడదీశారంటే ఆ రాష్ట్రంలో ఎంతటి భయాందోళన వాతావరణం ఉందో అర్థమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. శతాబ్దాలుగా గిరిజన తెగలు, ఇతర ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్న మణిపూర్ రాష్ట్రంలో మారణ హోమం జరగడానికి బిజెపి అనుసరించిన మతోన్మాద రాజకీయాలే కారణమని ఆరోపించారు. దేశ రక్షణ కోసం పని చేసిన ఒక సైనికుడి భార్యని తన కళ్ళముందే బట్టలూడదీసి నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారం చేయడం భారతమాత సిగ్గుతో తలదించుకునే విధంగా ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.  దేశంలో బిజెపి అనుసరిస్తున్న విద్వేష, మతోన్మాద విధ్వంసకర విధానాలకు మణిపూర్ మారణ హోమం ఒక ఉదాహరణ మాత్రమేనని అన్నారు. 

సైన్యం, పోలీసుల కళ్ళెదుటే ఇంతటి దారుణాలు జరుగుతుంటే అరికట్టలేని ఆ రాష్ట్ర బిజెపి ప్రభుత్వం ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండడానికి అర్హత లేదని బర్త్ రఫ్ చేసి శాంతిని నెలకొల్పెందుకు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.  మహిళలను నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారాలకు పాల్పడిన బీజేపీ గూండాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు మద్దెల జ్యోతి అధ్యక్షతన జరిగిన  జిల్లా కమిటీ సమావేశంలో ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మేకన బోయిన సైదమ్మ, ఐద్వా జిల్లా నాయకురాలు బచ్చల కూర మంగమ్మ, అండం నారాయణమ్మతదితరులు పాల్గొన్నారు.