తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ కోసం పిసిసికి దరఖాస్తు చేసుకున్న వడ్డేపల్లి రవి

తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ కోసం పిసిసికి దరఖాస్తు చేసుకున్న వడ్డేపల్లి రవి

తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ కోసం పిసిసికి దరఖాస్తు చేసుకున్న డాక్టర్ వడ్డేపల్లి రవి

తుంగతుర్తి ముద్ర: తుంగతుర్తి నియోజకవర్గ అభ్యర్థిగా తాను పోటీలో ఉంటానని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి డాక్టర్ వడ్డేపల్లి రవి సోమవారం దరఖాస్తు చేసుకున్నారు.డాక్టర్ వడ్డేపల్లి రవి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిసిసి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేవారు ముందస్తుగా తుంగతుర్తి నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు కావడంతో 25 వేల రూపాయల దరఖాస్తు రుసుము చెల్లించాలని నిబంధన పెట్టడంతో 25 వేల రూపాయల డిపాజిట్ చెల్లించి తుంగతుర్తి అసెంబ్లీకి పోటీలో ఉంటున్నట్టు దరఖాస్తు చేసుకున్నారు. శ్రావణమాసంలో సోమవారం విశిష్టమైన రోజు కావడంతో డాక్టర్ వడ్డేపల్లి రవి దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు.

ఈ సందర్భంగా వడ్డేపల్లి రవి మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం తధ్యమని పార్టీ అధిష్టానం తనకు అవకాశం ఇస్తుందని ఆశిస్తున్నాను అని అన్నారు .నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో తాను పర్యటించానాని ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు అన్ని మార్గాలు సుగమంగా ఉన్నాయని అన్నారు .