బి ఆర్ ఎస్ కార్య కర్తలు సమన్వయం తో పనిచేయాలి

బి ఆర్ ఎస్ కార్య కర్తలు సమన్వయం తో పనిచేయాలి

ముద్ర, తిరుమలగిరి: రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు సమన్వయంతో పనిచేసి పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని బిఆర్ఎస్ పార్టీ నాగారం మండల శాఖ అధ్యక్షులు కల్లెట్లపల్లి ఉప్పలయ్య ఎంపీపీ కూరం మని వెంకన్న కోరారు. శనివారం నాడు వారు నాగారం మండల కేంద్రంలో జరిగిన బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ సారధ్యంలో నియోజకవర్గం అన్ని రంగాలలో ఎంతో అభివృద్ధి చెందిందని వారన్నారు. గత సమైక్య పాలనలో తుంగతుర్తి నియోజకవర్గం కక్షలు కారుణ్యలతో శాంతిభద్రతలు క్షీణించి ప్రజలు భయనక వాతావరణంలో జీవించేవారని అన్నారు నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జిల్లా మంత్రి గుంతకండ్ల జగదిష్ రెడ్డి తుంగతుర్తి శాసన సభ్యులు నియోజకవర్గ0 అభివృద్ధి పధం లో పయనిస్తుందని అలాగే పచ్చని పొలాలతో శాంతి వాతావరణం లో నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో జీవనం సాగిస్తున్నారని వారన్నారు నియోజకవర్గంలో సాగు తాగునీరుతో పాటు విద్య వైద్యం కోసం కోట్లాది రూపాయల ను మంజూరు చేశారని వారన్నారు, రాబోయే సాధారణ ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర స్థాయిలో బిఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా, ప్రతీ కార్యకర్త పనిచేయాలని వారు అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కే అంజయ్య గ్రామ శాఖ అధ్యక్షులు రాచకొండ అంజయ్య,సర్పంచ్ మల్లాల ఈశ్వరమ్మ, ఉప సర్పంచ్ చిత్తలూరి రమేష్, మార్కెట్ డైరెక్టర్ జటంగి నర్సయ్య, రైతు కోఆర్డినేటర్ పులుసు వెంకన్న,మల్యాల అశోక్,నాతి శ్రీను, బొజ్జ ఎల్లయ్య,బొజ్జ అశోక్, జక్కి లింగయ్య, వడ్లకోండ రాములు, బాప్పని సాలయ్యా, బిఆర్ఎస్వీ మండల అధ్యక్షులు జిల్లా మధు, వీరబోయిన శ్రీను,దేశగని జాను, నామాల మల్లయ్య, తాడమళ్ళ జాన్, గాజుల అశోక్,బొంకూరి కృష్ణ, మేడే శ్రీకాంత్, మరయ్య, యకస్వామి, మొగలగాని అనిల్,అఖిల్,చిత్తలూరి సన్నీ సంజయ్, కండె అనిల్ బిఆర్ఎస్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు..