వారం రోజుల్లో సమస్యను పరిష్కరించాలి: అదనపు కలెక్టర్ ఏ.వెంకటరెడ్డి

వారం రోజుల్లో సమస్యను పరిష్కరించాలి: అదనపు కలెక్టర్ ఏ.వెంకటరెడ్డి

తుంగతుర్తి గిరిజన సంక్షేమ బాలికల గురుకుల బాలికల పాఠశాలను సందర్శించిన సూర్యాపేట జిల్లా అదన కలెక్టర్ 

తుంగతుర్తి ముద్ర: తుంగతుర్తి మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలోపలువురు  విద్యార్థినులు సోమవారం అస్వస్థతకు గురయ్యారు.అస్వస్థత గురైన విద్యార్థినులకు తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందించారు.విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్నసూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ ఏ వెంకటరెడ్డి  మంగళవారం పాఠశాలను  సందర్శించారు. ఈ మేరకు పాఠశాలలోనీ వంటగదులను, తరగతి గదులను, పరిసరాలను, వాటర్ సప్లై ప్రదేశాలను పరిశీలించారు. పాఠశాలలో సమస్యలు చాలా ఉన్నాయని వారం రోజులలో నెలకొన్న సమస్యలు పరిష్కరించకపోతే చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ ఉమారాణిని అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి హెచ్చరించారు.  విద్యార్థులు జేసీని కలిసి తమకు నెలకొన్న సమస్యలను వివరించారు. మంచినీరు కలుషితం కావడంతో విద్యార్థినిలు అస్వస్థతకు గురైనట్లు తన దృష్టికి వచ్చిందని నీటి శాంపిల్ ను  ల్యాబ్ కు పంపించనున్నట్లు తెలిపారు. ఆయనతోపాటు తుంగతుర్తి  తహసిల్దార్ రాంప్రసాద్,ఎంపీడీవో బీమ్ సింగ్, ఎంఈఓ బోయిన లింగయ్య, ఆర్ సి ఓ లక్ష్మయ్య పాల్గొన్నారు.