నియోజకవర్గం అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తే సహించేది లేదు

నియోజకవర్గం అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తే సహించేది లేదు

కోల్పోతున్న ఉనికిని కాపాడుకోవడానికి ఎమ్మెల్యే పై బిఆర్ఎస్ పార్టీ పై విమర్శలు డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు

తుంగతుర్తి ముద్ర: తుంగతుర్తి నియోజకవర్గంలో తమ ఉనికిని కాపాడుకోవడానికి బిఆర్ఎస్ పార్టీపై అలాగే తుంగతుర్తి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్న శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని డిసిసిబి డైరెక్టర్ సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు అన్నారు. బిజెపి చేపట్టిన నిరసన దీక్షలను ఉద్దేశించి మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి కేవలం 3000 ఓట్లు మాత్రమే వచ్చాయని కానీ 10% కూడా గ్రామాల్లో లేని బీజేపీ పార్టీ ప్రతి గ్రామంలో 70% కార్యకర్తల బలం ఉన్న బిఆర్ఎస్ పార్టీని విమర్శిస్తే కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని గ్రామాల పొలిమేరల వరకు తరిమి కొడతారని హెచ్చరించారు .తుంగతుర్తి నియోజకవర్గంలో ఇప్పటికే వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేసిన ఎమ్మెల్యే పై చిల్లర రాజకీయాలు చేసేవారు అవాకులు చవాకులు పేలితే సహించేది లేదని అన్నారు .ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా ఏదైనా సాధించవచ్చు అని రెండుసార్లు తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గాదరి కిషోర్ కుమార్ ను గెలిపించారని మూడోసారి కూడా ఎమ్మెల్యేగా గెలిచి ఈసారి హ్యాట్రిక్స్ సాధిస్తారని అన్నారు .

ఎన్నికల్లో కనీసం డిపాజిట్ దక్కించుకో లేనివారు ఎమ్మెల్యేని విమర్శిస్తే పెద్ద నాయకులమవుతామని HB కలలు కంటున్నారని వారి కలలు కలలుగానే మిగిలిపోతాయని గత ఫలితాలే తిరిగి పునరావృతం అవుతాయని అన్నారు .అభివృద్ధి చేస్తూ ప్రజాబలం కలిగి ఉన్న ఎమ్మెల్యేను మరో మారు విమర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు .తప్పుడు ఆరోపణలు చేసే వారికి ప్రజలు తగిన సమయంలో తగిన రీతిలో బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య ,దొంగరి శ్రీనివాస్, వైస్ ఎంపీపీ శ్రీశైలం, సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షులు నల్లు రామచంద్రారెడ్డి ,బిఆర్ఎస్ నాయకులు గుండ గాని రాములు గౌడ్ ,మండల ప్రధాన కార్యదర్శి కటకం వెంకటేశ్వర్లు,తునికి సాయిలు, గ్రామ శాఖ అధ్యక్షులు గోపగాని శ్రీనివాస్ గౌడ్, గ్రంధాలయ చైర్మన్ గోపగాని రమేష్ గౌడ్ ,దేవాలయ చైర్మన్ ముత్యాల వెంకటేశ్వర్లు ,మార్కెట్ డైరెక్టర్ పులుసు వెంకటనారాయణ గౌడ్ ,లతోపాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.