మహిళలు స్వశక్తితో రాణించాలి

మహిళలు స్వశక్తితో రాణించాలి

కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ ల ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభం

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: మహిళలు స్వశక్తితో రాణించాలని లయన్స్ క్లబ్ ఆఫ్ స్ఫూర్తి అధ్యక్షురాలు బీరవోలు హైమావతి, 45 వార్డ్ కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ లు అన్నారు. జిల్లా కేంద్రంలోని 45 వార్డులో గండూరి జానకమ్మ  వాటర్ ప్లాంట్ దగ్గర  లయన్స్ క్లబ్ స్పూర్తి సూర్యాపేట ,కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ ల ఆధ్వర్యంలో  ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని  ఆదివారం  ప్రారంభించారు.ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ మహిళలు ఇంటికే పరిమితం కాకుండా రాజకీయ, సేవారంగంలో ప్రస్తుతం భాగస్వాములు కావడం హర్షణీయమని ఉపాధి కల్పన  కొరకే ఈ శిక్షణ ను ప్రారంభించినట్లు  తెలిపారు.

ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో  రాణిస్తున్నారని మహిళా సాధికారత ఉండాలనే  సంకల్పంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో, లయన్స్ క్లబ్ ఆఫ్  స్పూర్తి రీజినల్ ఛైర్మన్ గండూరి కృపాకర్, లయన్స్ క్లబ్ ఆఫ్  స్పూర్తి జోన్ చైర్మన్ ఆదుర్తి రమేష్ చంద్ర, లయన్స్ క్లబ్ ఆఫ్ స్ఫూర్తి సెక్రటరీ వెన్న కవిత, లయన్స్ క్లబ్ ఆప్ స్ఫూర్తి ఎల్సీ డాకా విజయలక్ష్మి, ఇరిగి కోటేశ్వరి, టైలరింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దూలం నగేష్, వెంకటలక్ష్మి, ఆర్పీ విజయ, పద్మ ,ఆండాలు, నామ వేణు, కళ్యాణ్ ,కుక్కడపు భిక్షం,సాలయ్య , సందీప్, తదితరులు పాల్గొన్నారు