తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకం..

తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకం..
  • ప్రభుత్వానికి ప్రజలకు వారధులు జర్నలిస్టులు...
  • జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు..
  • ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

ముద్ర,అనంతగిరి:తెలంగాణలో జర్నలిస్టుల పాత్ర చాలా కీలకమైనదని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.శుక్రవారం అనంతగిరి నూతన ప్రెస్ క్లబ్ ఏర్పాటైన సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుడిమెట్ల రామకృష్ణ,ప్రధాన కార్యదర్శి గరిడేపల్లి రాము తోటి జర్నలిస్టు మిత్రులు శుక్రవారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన కమిటీని ప్రత్యేకంగా అభినందించారు.అనంతరం ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలిచి సమాజంలోని సమస్యలను వెలికి తీసే జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టు సంక్షేమానికి 100 కోట్ల నిధులతో ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఆదుకుంటున్నారని పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.రాష్ట్ర సాధనలో వారి భాగస్వామ్యం సముచితమన్నారు.అనంతగిరి మండల జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుడిమెట్ల రామకృష్ణ ఎమ్మెల్యే ను కోరారు.స్పందించిన ఎమ్మెల్యే అనంతగిరి ఎమ్మార్వో తో చరవాణిలో మాట్లాడి త్వరితగతిన రెండు మూడు రోజుల్లో ఇళ్ల స్థలాల పట్టాలు జర్నలిస్టులకు అందించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు బూర సత్యనారాయణ, గౌరవ సలహాదారులు కొలిచలం శ్రీను,ఉపాధ్యక్షులు బానోతు సతీష్,బెల్లంకొండ సతీష్,కోశాధికారి గరిడేపల్లి మణికంఠ,సహాయ కార్యదర్శిలు బానోతు రవి,శ్రీరామ్ రవి,గరిడేపల్లి మురళి,దారెల్లి అనిల్,గద్దె రాంబాబు,అల్లుచలం తదితరులు పాల్గొన్నారు.