డెక్కన్ సిమెంట్స్ లిమిటెడ్  ఆధ్వర్యంలో మహంకాళి గూడెం గ్రామ నవీకరణ...

డెక్కన్ సిమెంట్స్ లిమిటెడ్  ఆధ్వర్యంలో మహంకాళి గూడెం గ్రామ నవీకరణ...

ముద్ర,పాలకీడు:-మండల పరిధిలోని భవాననిపురం  డెక్కన్ సిమెంట్స్ యాజమాన్యం  సౌజన్యంతో   సమీప గ్రామం అయిన మహంకాళి గూడెం గ్రామంలో మరిన్ని సౌకర్యాల రూపకల్పన చేయటకు సుమారు రూ.40 లక్షల తో    గ్రామంలో సీ సీ రోడ్లు,మరుగుదొడ్లు, డ్రైనేజీ కాల్వలు, స్కూల్ రిపేర్లు మొదలగు ప్రజా ఉపయోగ సౌకర్యాల  రూపకల్పన పనులు చేపట్టారు. పనులను డెక్కన్ సిమెంట్స్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఎన్.శ్రీనివాస రాజు , చీఫ్ జనరల్ మేనేజర్  ఎస్.నాగ మల్లేశ్వర రావ్ లు ప్రారంభించారు. కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షుడు  కిష్టపాటి అంజిరెడ్డి, జిల్లా రైతు సంన్వయ సమితి సభ్యులు దర్గారావు ,సర్పంచ్ శ్వేతా విజయ్ ,ఉప సర్పంచ్ శోభ రాణి దాసు  , సొసైటీ చైర్మెన్ సత్యనారాయణ రెడ్డి ,వార్డ్ మెంబర్లు  నారాయణ,  మరియమ్మ , జిల్లా ప్రసాద్,  మరియదాసు, పిడమర్తి ప్రేమ కుమార్ తదితరులు పాల్గొన్నారు.