ఆపదలో ఆపన్న హస్తం సీఎం రిలీఫ్ ఫండ్  - ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

ఆపదలో ఆపన్న హస్తం సీఎం రిలీఫ్ ఫండ్  - ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

హుజూర్ నగర్, టౌన్, ముద్ర:ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు నేనున్నా అంటూ ముఖ్యమంత్రి  చంద్రశేఖర రావు పనిచేస్తున్నారని  ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ మండలాల నుంచి వచ్చిన లబ్ధిదారులకు రూ 10 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా బాధపడకూడదని ,అదే బంగారు తెలంగాణ అని అన్నారు. కార్యక్రమంలో వివిధ మండలాల ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు ,బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.