టికెట్ నాకే గెలుపు నాదే అంటున్న మందుల సామెల్

టికెట్ నాకే గెలుపు నాదే అంటున్న మందుల సామెల్

తుంగతుర్తి ముద్ర: తుంగతుర్తి టిఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ టికెట్ 2023 లో నైనా నాకే కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు విజ్ఞప్తి చేస్తున్నానని, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల సామేలు అన్నారు. తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ సమయంలో తుంగతుర్తి నియోజకవర్గంలో గులాబీ జెండాను రెపరెపలాడించింది తానేనని, నియోజకవర్గంలోని గ్రామ గ్రామాన బిఆర్ఎస్ జెండా గద్దెలను నిర్మించింది తానేనని అన్నారు. గత రెండుసార్లు బిఆర్ఎస్ అభ్యర్థి గెలవడానికి కారణం తాను ఆనాడు గులాబీ పార్టీని అభివృద్ధి చేయడంలో భాగమేనని అన్నారు. కష్టం ఒకరిది ఫలితం ఒకరిదిలా మారిందని అన్నారు.

2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అనివార్య కారణాలవల్ల టికెట్ ఇవ్వలేకపోతున్నానని, ఎమ్మెల్సీ పదవి చెప్పకుండా ఇస్తామని చెప్పిన తదనంతరం ఆ విధంగా జరగలేదని అన్నారు. రెండవసారి 2019లో సైతం ఇలానే జరిగిందని 2023 ఎన్నికల్లో తప్పకుండా టికెట్ ఇస్తామనీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారనీ,ఆ హామీ మేరకు 2023లో జరిగే ఎన్నికలకు తుంగతుర్తి సీటు తనకు కేటాయించాలని కోరారు. తనకు టికెట్ ఇస్తే గెలుపు ఖాయమని నియోజకవర్గంలోని రోడ్ల దుస్థితిని మారుస్తానని, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో అడ్డగూడూరు మాజీ సర్పంచ్ కూరాకుల యాదగిరి, గొట్టిపర్తి గ్రామ టిఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు కేతిరెడ్డి  రమేష్ రెడ్డి, నాగారం మాజీ సర్పంచ్ చిప్పలపల్లి రాములు ,ఎక్స్ ఎంపిటిసి  ఎల్లయ్య లతోపాటు పలువురు పాల్గొన్నారు.