శాంతియుత దీక్షను భగ్నం చేస్తారా?

శాంతియుత దీక్షను భగ్నం చేస్తారా?
  • ప్రశ్నిస్తే దాడులు చేస్తారా ?
  • రానున్న కాలంలో పోరాటం మరింత ఉధృతం చేస్తాం
  • బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిబాబా

తుంగతుర్తి ముద్ర: తుంగతుర్తి నియోజకవర్గం లో అభివృద్ధి కుంటుపడిందని ఇసుక మాఫియా , భూమాఫియా రాజ్యమేలుతుందని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబు అన్నారు .తుంగతుర్తి నియోజకవర్గం కేంద్రంలో తాము జరుగుతున్న అరాచకాలు అక్రమాలపై శాంతియుతంగా దీక్ష కార్యక్రమాలు చేపడితే అధికార పార్టీ వారు పోలీసులతో తమ దీక్షను భగ్న చేస్తూ అరెస్టు చేయడం హేయమైన చర్యని అన్నారు .బిఆర్ఎస్ నాయకులు అడ్డువస్తే అంత చూస్తా అని ధోరణితో వ్యవహరిస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలో రవాణా సౌకర్యం లేదని వర్షాలు వస్తే రోడ్లపై ప్రవహించే నీటి ప్రవాహాల్లో మనుషులుకొట్టుకుపోతున్న పట్టించుకోవడంలేదని అన్నారు .విద్య ,వైద్య రంగాలు పూర్తిగా కుంటుపడ్డాయని అన్నారు .

మద్దిరాల, వెలుగుపల్లి తదితర గ్రామాల్లో భూ కబ్జాలు జరిగాయని అన్నారు .అభివృద్ధి తదితర విషయాలపై ప్రశ్నిస్తే దాడులు చేయడం పరిపాటుగా మారిందని ఇప్పటికి రెండుసార్లు తనపై దాడులు చేశారని సాయిబాబా అన్నారు. దాడులకు భయపడేది లేదని అక్రమాలు దాడులు దౌర్జన్యాలను ఎండగడతామని అన్నారు .నియోజకవర్గంలో ఏ ఒక్కరికి. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదని దళిత బందులో అవినీతి జరిగిందని అన్నారు .రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని ఓడించడం ఖాయమని అన్నారు .ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గాజుల మహేందర్ తో పాటు పలువురు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.