పాడి రైతుల ధర్నా

పాడి రైతుల ధర్నా
  • పెండింగ్ బకాయిలు చెల్లించాలి
  • పాడి రైతులకు ఉచిత విద్యుత్, దాన సబ్సిడీ ఇవ్వాలి
  • 40 నిమిషాల పాటు ధర్నా ఉద్రిక్తత
  • ఎల్లారెడ్డిపేట మండల పాడి రైతుల డిమాండ్

ముద్ర,ఎల్లారెడ్డిపేట : పాడి రైతుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని నిరసిస్తూ ఎల్లారెడ్డిపేట మండల పాడి రైతుల ధర్నా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శనివారం సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారి పైన సుమారు 200 మంది పాడి రైతులు పాల్గొని ధర్నా చేశారు. పాడి రైతులకు భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, జిల్లా ఉపాధ్యక్షులు గుండాడి వెంకట్ రెడ్డి, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు సత్యం రెడ్డి, మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బందారపు లక్ష్మారెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. సుమారు 45 నిమిషాల పాటు ధర్నా చేపట్టి పాడి రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని జై జవాన్ జై కిసాన్, ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం అంటూ నినాదాలు చేశారు.

జిల్లా కలెక్టర్ రావాలంటు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ 56 నెలలుగా లీటర్ కు నాలుగు రూపాయలు పెంచిన బకాయలు వెంటనే చెల్లించాలని అదేవిధంగా పాడి రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తానన్న హామీ నెరవేర్చలేదని అన్నారు. దానా సబ్సిడీ కూడా ఇవ్వాలని పాడి రైతులను ఆదుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కి సూచించారు. సమాచారం తెలుసుకున్న ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్ ధర్నా ప్రాంతానికి వచ్చి పాడి రైతులతో మాట్లాడే ప్రయత్నం చేయగా జిల్లా కలెక్టర్ రావాలంటూ వాగ్వాదానికి దిగారు. డిప్యూటీ తహసిల్దార్ జయంత్ కుమార్ చేరుకొని పాడి రైతులతో మాట్లాడి వినతి పత్రాన్ని అందుకున్నాడు. అనంతరం ధర్నా విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో మండల పాడి రైతుల సంఘం నాయకులు ముత్యాల రమేష్ రెడ్డి, శ్రీనివాస్, మహిపాల్, సల్ల పద్మా రెడ్డి, తోపు చెర్ల నారాయణ, మాచర్ల మహేందర్, బాలయ్య, నారాయణరెడ్డి, పొన్నాల దేవి రెడ్డి, కొప్పుల కరుణాకర్ రెడ్డి, సందుపట్ల రవి, పాడి రైతులు పాల్గొన్నారు.