సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంకు లి. సిరిసిల్ల అర్ధ వార్షిక మహాసభ

సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంకు లి. సిరిసిల్ల అర్ధ వార్షిక మహాసభ
ముద్ర సిరిసిల్ల టౌన్: సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంకు లి. సిరిసిల్ల యొక్క అర్ధ వార్షిక మహాసభ 2022-2023 సంవత్సరం గాను తేదీ 24-03-2023 రోజున పద్మశాలి సంఘం కళ్యాణ భవనం లో నిర్వహించారు. ఈ సమావేశములో  గడ్డం విఠల్ అధ్యక్షులు(ఇంఛార్జ్) మాట్లాడుతూ బ్యాంకు అధ్యక్షులు, పాలకవర్గం కృషి వలన సాధించిన ప్రగతి 6876 మంది సభ్యులతో రూ.193.90 లక్షల వాటాధనము కలిగి, గడిచిన సంవత్సరము బ్యాంకు డిపాజిట్లు 9254.51 లక్షలు, ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి 9016.31 లక్షలు కలవని, బ్యాంకు పై ఖాతాదారులు విశ్వాసం కనబరుస్తూ బ్యాంకు అభివృద్ధికి ప్రోత్సహిస్తున్నందుకు ఖాతాదారులకు కృతజ్ఞతలు తెలిపారు. గత సంవత్సరము బ్యాంకు మంజూరు చేసిన ఋణాలు 5719.89 లక్షలు కలిగి ఉండగా ఈ ఆర్థిక సంవత్సరము ముగింపు నాటికి 6073.76 లక్షలు కలిగి ఉన్నది అని చెప్పారు.
బ్యాంకు బకాయిదారులు సకాలములో అప్పు చెల్లించి బ్యాంకు యొక్క అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని గౌరవ సభ్యులు గుడూరి ప్రవీణ్, జిందం చక్రపాణి , మాజీ అధ్యక్షులు గాజుల బాలయ్య,  దార్నమ్ లక్ష్మీనారాయణ, మాజీ కార్యవర్గ సభ్యులు,గౌరవ సభ్యులు తెలిపినారు. 2023-2024 సంవత్సరపు అంచనా బడ్జెట్ రూ. 1100.00 లక్షలు ఈ మహాసభలో ఆమోదించినారు. ఈ మహాసభలో గడ్డం విఠల్ అధ్యక్షులు(ఇంఛార్జ్), కార్యవర్గ సభ్యులు మందాడి శ్రీనివాస్ రెడ్డి, బొద్ధుల భాస్కర్, కోడం సంజీవ్, స్వర్గం రాజు, అడ్డగట్ల శారద, అడిచెర్ల సాయికృష్ణ, ఆడెపు అనసూర్య, నేరెళ్ళ శ్రీకాంత్ గౌడ్, వేముల రాములు, సిఏ  వెన్నం మల్లేశం, ముఖ్య కార్యనిర్వహణ అధికారి చీటీ ప్రకాష్ రావు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.