దీప్తి మృతి కేసులో మిస్టరీ వీడేనా..!

దీప్తి మృతి కేసులో మిస్టరీ వీడేనా..!
  • దీప్తి చెల్లెలు, చెల్లెలి బాయ్ ఫ్రెండ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..
  • అసలు ఆమెను చంపింది వాళ్లేనా..?

మెట్‌పల్లి ముద్ర: కోరుట్ల పట్టణంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోరుట్ల పట్టణంలోని భీముని దుబ్బ లో జరిగిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ దీప్తి  అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ కి తెరపడే అవకాశం ఉంది.దీప్తి మృతిని ఛాలెంజ్ గా తీసుకొని వివిధ కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు.మెట్‌పల్లి డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి దీప్తి మృతి తర్వాత బాయ్ ఫ్రెండ్ తో పారిపోయిన దీప్తి చెల్లెలు చందన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇంట్లో నుండి 2 లక్షల రూపాయలతో పాటు ఇచ్చిన పిర్యాదు 90 లక్షల రూపాయల విలువగల బంగారం కనబడకుండా పోయినట్లు దీప్తి తండ్రి ఇచ్చిన పిర్యాదు మేరకు.చందన బాయ్ ఫ్రెండ్ తో విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని భావించిన పోలీసులు చందన సెల్ ఫోన్  లొకేషన్ ఆధారంగా గాలింపు చేపట్టారు. హైదరాబాద్ లో ఉన్నారనే సమాచారం తో అక్కడికి వెళ్లి గాలించగా అక్కడి నుండి వేరే చోటికి చందన బాయ్ ఫ్రెండ్ తో మకం మార్చారు..

ఆంధ్రలో అదుపులోకి..

చందన, ఆమె బాయ్ ఫ్రెండ్ కు పాస్పోర్ట్ లు ఉండడంతో విదేశాలకు పారిపోయే అవకాశం ఉన్నదని గ్రహించిన పోలీసులు, లుకావుట్ నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్, బెంగళూరు ఎయిర్పోర్ట్ పరిసరాలకు వెళ్లే రహదారుల తో పాటు అనుబంధంగా ఉన్న గ్రామాల్లో, పట్టణాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో దీప్తి తండ్రి శ్రీనివాస్ రెడ్డి ది ఆంధ్ర ప్రాంతం కావడంతో అక్కడికి వెళ్లి ఉండచ్చనే అనుమానంతో పోలీసు బృందాలు ఆంధ్ర ప్రాంతానికి వెళ్లి అక్కడి పోలీసుల సహకారంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.ప్రకాశం జిల్లా పరిసరాల్లో చందన ఆమె బాయ్ ఫ్రెండ్ తో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ప్రకాశం జిల్లా సరిహద్దుల్లో శుక్రవారం అదుపులోకి తీసుకుని శుక్రవారం రాత్రి కోరుట్ల పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

అసలు ఆమెను చంపింది వాళ్లేనా...?

అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన దీప్తిని అసలు చంపింది దీప్తి చెల్లెలు చందన, బాయ్ ఫ్రెండ్ లు చంపి ఉంటారా లేక ఇంకా ఏదైనా జరిగిందా. అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. దీప్తి మృతి చెందకంటే ముందు రాత్రి ఇంట్లో మద్యం సేవించడం ఆ తర్వాత దీప్తి మృతి చెందడం, దీప్తికి తోడుగా ఉన్న చెల్లెలు పారిపోవడం, అనంతరం చందన తన తమ్ముడికి అక్క మద్యం సేవించి, తన బాయ్ ఫ్రెండ్ ను రమ్మని ఫోన్ చేసింది అని తను చంపలేదు అని వాయిస్ మెసేజ్ పంపడంతో దీప్తి మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే వాయిస్ మెసేజ్ ఆధారంగా చందన ఇంట్లో నుండి వెళ్లిపోయిన తర్వాత ఇంకా ఎవరైనా ఇంటికి వచ్చిఉంటారా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.శుక్రవారం చందన తో పాటు బాయ్ ఫ్రెండ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు శనివారం విచారించనున్నాట్లు తెలుస్తుంది. పోలీసు విచారణ అనంతరం అసలు నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది..