ప్రజలను దగా చేయడంలో సీఎం కెసిఆర్ ను మించిన వారు ప్రపంచం లో లేరు

ప్రజలను దగా చేయడంలో సీఎం కెసిఆర్ ను మించిన వారు ప్రపంచం లో లేరు

దేశంలో స్వయం ఉపాధి పథకం ఒక్కరికీ కూడా ఇవ్వని రాష్ట్రం తెలంగాణ ఒక్కటే
బీసీ సామాజిక వర్గాలను కేసిఆర్ మోసం చేస్తున్నారు-ఎమ్మెల్సి జీవన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : ప్రజలను దగా చేయడంలో సీఎం కెసిఆర్ ను మించిన వారు ప్రప్రంచంలో ఎవరు లేరని అన్నారు. జగిత్యాలకు వచ్చిన ఏ ఐ సీ సీ కార్యదర్శి నదిం జావేద్ తో కలిసి దళిత సమాజం ఏ విధంగా దగా చేయబడుతుందో బహిరంగ లేఖను ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్సీ, ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్ గా పేరు మార్చి, నిధులు ఖర్చు చేయకుండ రాబోయే సంవత్సరంలో క్యారీ ఫార్వర్డ్ ను ఆసరాగా చేసుకొని దళితులను దగా చేస్తున్నారని అన్నారు.

దళితులకు మూడు ఎకరాల భూమి పథకం కనుమరుగైంది..మూడు ఎకరాల భూమి రూ.10లక్షలకు ఎకరం చొప్పున ఇచ్చిన దళితులకు రు.30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసారు. 2022-23 లో  దళిత బంధు పథకం కింద నియోజక వర్గంలో 1500 మందికి బడ్జెట్ లో రు.17,700 కోట్లు కేటాయించినా ఒక్కరికీ కూడా ఇవ్వలేదు.. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. ప్రజలు ప్రభుత్వ చిత్తశుద్ది నీ గమనించాలని కోరారు.రాష్ట్రం ఏర్పడిన తర్వాత హౌసింగ్ డిపార్ట్ మెంట్ ఎత్తేశారు. రాష్ట్రంలో 4 లక్షల ఇళ్లు కట్టేందుకు రు.12 వేల కోట్లు బడ్జెట్ లో కేటాయించి, ఆమోదం పొందారు. 2022-23 దళిత బంధు, స్వంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టింది శూన్యం.మళ్ళీ టేపు రికార్డ్ ఆన్ చేశారని, జూలై లో స్వంత స్థలాల్లో అంటూ అని ఎద్దేవా చేశారు.

దేశంలో స్వయం ఉపాధి పథకం ఒక్కరికీ కూడా ఇవ్వని రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అని, బీసీ సామాజిక వర్గాలను సిఎం కెసిఆర్ మోసం చేస్తున్నారని అన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ మీ చేతిలో లేనప్పుడు ఇస్తామని ఎందుకు చెప్పారని, మైనారిటీలకు నిధులు కేటాయించడం మీ చేతిలోనే ఉన్నది కాదా ఎందుకు కేటాయించడం లేదు అని నిలదీశారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు అడ్లూరు లక్ష్మి కుమార్, పీసీసీ సభ్యులు గిరి నాగభూషణం పిసిసి కార్యదర్శి బండ శంకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య, కల్లేపల్లి దుర్గయ్య, పీసీసీ ఎన్నారై స్టేట్ కన్వీనర్ చాంద్ పాషా, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మన్సూర్ పట్టణ అధ్యక్షుడు నేహాల్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుండా మధు, పుప్పల అశోక్, మహిపాల్, తదితరులు పాల్గొన్నారు.