కలెక్టరేట్ లో ఇఫ్తార్ విందు .. పాల్గొన్న జిల్లా కలెక్టర్ 

కలెక్టరేట్ లో ఇఫ్తార్ విందు .. పాల్గొన్న జిల్లా కలెక్టర్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తారు విందు ఏర్పాటు చేశారు. ముఖ్యాతిధిగా జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాష పాల్గొనగా, ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు బిఎస్ లత, మంద మకరంద్, జగిత్యాల, మెట్పల్లి అర్దిఒలు మాధురి, వినోద్ కుమార్,

టిఎన్ జిఓ అధ్యక్షు,కార్యదర్శులు బోగ శశిధర్, నరేందర్ రెడ్డి, పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు హరి అశోక్ కుమార్, టిఆర్ఇ ఎస్ ఏ అధ్యక్షుడు ఎండి వకీల్, కార్యదర్శి సిహెచ్ కృష్ణ, కలెక్టరేట్ ఏఓ  నాగార్జున, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ సభ్యులు, టిఎన్ జిఓ సభ్యులు, జిల్లా అధికారులు, జిల్లా రెవెన్యు ఉద్యోగులు, ముస్లిం మైనారిటి ఉద్యోగులు, నాయకులు పాల్గొన్నారు.