టెలిగ్రామ్ అప్ లో ప్రకటన చూసి 6.63 లక్షలు మోసపోయిన బాధితుడు

టెలిగ్రామ్ అప్ లో ప్రకటన చూసి 6.63 లక్షలు మోసపోయిన బాధితుడు

ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి.... ధర్మపురి సిఐ కోటేశ్వర్

ధర్మపురి పట్టణానికి చెందిన వేముల ప్రశాంత్ టెలిగ్రామ్ అప్ లో మోసపూరిత ప్రకటన చూసి 6.63 లక్షలు పోగొట్టుకున్నట్లు ధర్మపురి సిఐ కోటేశ్వర్ తెలిపారు. వేముల ప్రశాంత్ టెలిగ్రామ్ యాప్ కు గుర్తు తెలియని వ్యక్తి గూగుల్ రివ్యూవల్ గా పార్ట్ టైం జాబ్ చేస్తే, డబ్బులు వస్తాయని ప్రకటన పంపాడు. అందులో చేరాలంటే ముందుగా కొంత డబ్బు జమ చేయాలని సూచించాడు, అలా జమ చేస్తే రెట్టింపు డబ్బులు వస్తాయని నమ్మపలికాడు. అందుకు తోడుగా ఆ గ్రూప్ లో ఉన్న మిగతావారు కూడా అది నిజమే అని తమకు డబ్బులు జమ అయ్యాయని వారికీ జమ అయినట్లుగా వారి వారి గూగల్ పే స్క్రీన్ షాట్లను టెలిగ్రాం అప్ లో షేర్ చేశారు. ఇది నమ్మిన ప్రశాంత్ ఓకే రోజు రూ. 10, 20 వేలు నుంచి మొదలు పెట్టి గుర్తు తెలియని వ్యక్తి చెప్పిన విధంగా మొత్తం రూ.6,63,888 పంపాడు.

డబ్బులు తిరగి రాకపోవడం, గ్రూపులో ఉన్న వారిని ఆన్ లైనులో సంప్రదించే ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాక పోవడంతో తను మోసపోయానని బాధితుడు ధర్మపురి పోలీసులను ఆశ్రయించాడు . బాధితుని ఫిర్యదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ కోటేశ్వర్ తెలిపారు. మోసపోయిన వ్యక్తి సాఫ్ట్వేర్ ఉద్యోగి కావడం విశేషం. వాట్సప్, టెలిగ్రామ్ యాప్ లలో వచ్చే ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియా లో వచ్చిన ప్రకటనలు చూసి వారి తెలిపిన నంబర్లకు ఫోన్ చేసి వారికి డబ్బులు పంపి మోసపోవద్దని సిఐ తెలిపారు. ఒకవేల Online లో మోసపోయి మీ డబ్బులు పోయినట్లు అయితే మీరు వెంటనే 1930 కు కాల్ చేసి పిర్యాదు చేయాలని సిఐ సూచించారు.