రిజర్వాయర్లను పరిశీలించిన స్పీకర్ పోచారం, మంత్రులు

రిజర్వాయర్లను పరిశీలించిన స్పీకర్ పోచారం, మంత్రులు

సిద్దిపేట: ముద్ర ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త రిజర్వాయర్లను రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. బుధవారము రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు వచ్చిన శాసనసభ స్పీకర్ పోచారం కొండపోచమ్మ రిజర్వాయర్ను, కొమురవెల్లి మల్లన్న రిజర్వాయర్ ను, రంగనాయక సాగర్ రిజర్వాయర్ ను, నిర్మించిన అన్నపూర్ణ రిజర్వాయర్ ను, మిడుమానేర్ రిజర్వాయర్లను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామం వద్ద నిర్మించిన ఆచార్య కొత్త పెళ్లి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ వ్యవసాయ కళాశాల భవన సముదాయాలను ప్రారంభించడానికి హైదరాబాదు నుంచి రాష్ట్ర మంత్రులు కేటీఆర్ నిరంజన్ రెడ్డి ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ తో కలిసి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి హెలికాప్టర్ లో వచ్చారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ లో నిర్మితమైన రిజర్వాయర్లను హెలికాప్టర్ నుండే కేటీఆర్ స్పీకర్కు చూపించారు. మండే సమృద్ధి అయిన నీటితో కలకలలాడుతున్న రిజర్వాయర్లను చూపించడంతో స్పీకర్ పోచారం స్వయంగా ఫోన్లో రిజర్వాయర్ల ఫోటోలు తీసుకున్నారు. తెలంగాణ ప్రజల తాగునీటికి రైతాంగానికి సాగునీటికి కాకుండాముందు చూపుతో నిర్మించిన రిజర్వాయర్లతో పంటలు పచ్చదనంతో ఈ ప్రాంతమంతా కలకలలాడుతుందని పోచారం సీఎంను కొనియాడారు.