గాయపడ్డ జర్నలిస్టు కుటుంబాలను  అదుకోవాలి: టియుడబ్ల్యుజె (ఐజెయు) జిల్లా కమిటి డిమాండ్

గాయపడ్డ జర్నలిస్టు కుటుంబాలను  అదుకోవాలి: టియుడబ్ల్యుజె (ఐజెయు) జిల్లా కమిటి డిమాండ్

ఖమ్మం, ముద్ర: కారేపల్లి మండలం చీమలపాడు గ్రామంలో జరిగిన సంఘటనలో గాయపడిన జర్నలిస్టు కుటుంబాలతో పాటు మరణించిన  చెందిన, గాయపడిన ఇతర కుటుంబాలను సైతం అన్నివిధాలుగా అదుకోవాలని టియుడబ్ల్యుజె (ఐ జె యు)  జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.  బి ఆర్ ఎస్ పార్టీ నిర్వహించే ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని కవర్ చేయడానికి మండల విలేఖర్లంతా చీమల పాడు గ్రామానికి వెళ్ళారని అయితే  దురద్రష్టావశాత్తు బాణాసంచా పేలుళ్లలో  గ్యాస్ సిలిండర్ పెలిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మ్రతి చెందడం మరో 8మంది గాయపడటం విచారకరమని కమిటీ పేర్కొంది. ఈ సంఘటనలో మండలానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ , ప్రజాజ్యోతి విలేఖరి తేళ్ళ శ్రీనివాస్, నీఘా పేపర్ విలేఖరి అంగోతు కుమార్ , కానిస్టేబుల్ నవీన్ తీవ్రంగా గాయపడ్డారని , కుమార్ కుడి కాలుని పూర్తిగా తీసి వేసిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

క్షత్ర గాత్రులు ఖమ్మం లోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వీరికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ,పూర్తిగా నయం అయ్యేంత వరకు ప్రభుత్వం వారికి అండగా ఉండాలని కమిటీ కోరింది. మ్రతి చెందిన కుటుంబాలతో పాటు గాయపడిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తో పాటు బి ఆర్ ఎస్ పార్టీ కూడా  అండగా ఉండి పూర్తి స్దాయిలో అదుకోవాలని టి యు డబ్ల్యు జె ఐ జె యు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాంనారాయణ, జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వర్ రావు, కోశాధికారి జనతా శివ, జాతీయ కౌన్సిల్ సభ్యులు రవీంధ్ర శేషు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మాటేటి వేణుగోపాల్, సామినేని మురారీ, రాష్ట్ర నాయకులు నర్వనేని వెంకట్రావ్, ఎలక్ర్టానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు ఆవుల శ్రీనివాస్, కనకం సైదులు, నగర అధ్యక్ష కార్యదర్శులు మైసా పాపారావు, ఉషోదయం శ్రీనివాస్ , జిల్లా కమిటి ఉపాధ్యక్షులు తాతా శ్రీనివాస్, సభ్యులు కళ్యాణ్  తదితరులు  ఒక ప్రకటనలో కోరారు.