టీడీపీ కి పూర్వవైభవం తీసుకువస్తా

టీడీపీ కి పూర్వవైభవం తీసుకువస్తా
  •  జిల్లాల వారీగా మహాసభలు 
  • టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు పేదల పక్షాన పోరాడుతూనే ఉంటుందని తెలుగుదేశం
పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ స్పష్టం చేశారు. బుధవారం
కరీంనగర్ జిల్లాలోని పద్మనాయక కళ్యాణ మండపంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ
అబ్జర్వర్ వంచ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పార్టీ శంఖారావ సభకు ఆయన
ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ పేదలకు కూడు, గూడు, నీడ
కల్పించాలనే ఉదాత్తమైన ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ ఎన్టీరామారావు స్థాపించారని, 9
నెలల కాలంలోనే పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చి పేద బడుగు, బలహీనవర్గాల కోసం
వినూతన పథకాలు ప్రవేశపట్టి అమలుపర్చారన్నారు. అందులో భాగంగానే రెండు రూపాయలకు
కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారని ఆయన
కొనియాడారు.

ప్రతి ఇంట్లో కడుపునింపుకునే భాగ్యం పేదలకు లేకుండాపోవడం ఎన్టీఆర్
ఎంతగానో కలచివేసిందనే, అందుకే ఆ మహనీయుడు పేదల కడుపు నింపేదుకే ఈ పథకం
తెచ్చారన్నారు. ఎన్టీఆర్ను ఇప్పటికీ పేదలు గుండెల్లో పెట్టుకుని కొలుస్తున్నారని ఆయన
పేర్కొన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే బీసీ వర్గానికి చెందిన నాకు రాజకీయంగా అనేక అవకాశాలు
వచ్చాయన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్దే ఇప్పుడు ప్రతి పల్లెలో
కనిపిస్తోందన్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో కార్యకర్తలు ఉత్సాహంగా
పాల్గొంటున్నారని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ క్రియాశీల భూమిక
పోషిస్తుందన్నారు.ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పార్టీ బలోపేతంతోపాటు పార్టీకి
పూర్వవైవం తీసుకురావడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. పార్టీకి పూర్వవైభవం
తెచ్చేందుకే జిల్లాల వారీగా సభలు నిర్వహించతలపెట్టినట్టు చెప్పారు. నూతంగా పార్టీలో చేరిన
వారికి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకు
ముందు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తెలుగుదేశం పార్టీ కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయాన్ని
ప్రారంభించారు.

ఆ కార్యక్రమంలో పోలిట్ బ్యూర్ సభ్యులు రావుల చంద్రసేఖర్ రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్,బంటు
వెంకటేశ్వర్లు, జాతీయ అధికార ప్రతినిధులు నన్నూరి నర్సిరెడ్డి, తిరునగరి జ్యోత్స్న, రాష్ట్ర అనుబంధ
సంఘాల అధ్యక్షులు పొగాకు జయరాం, కాక కృష్ణమోహన్, శ్రీపతి సతీష్, పర్లపల్లి రవీందర్,
హరికృష్ణ,పోలంపల్లి అశోక్, ఎంకే బోస్,నియోజవర్గ కో-ఆర్డినేటర్లు కళ్యాడపు ఆగయ్య, ఎడ్ల
వెంకటయ్య, జంగం అంజయ్య,పులి రాంబాబు గౌడ్,ఆవునూరి దయాకర్ రావు, బత్తుల శ్రీనివాస్
తదితరులు పాల్గొన్నారు.