తమ్ముడి కోసం తపన చిరకాల ఉండేలా రూపకల్పన

తమ్ముడి కోసం తపన చిరకాల ఉండేలా రూపకల్పన
  • తమ్ముడు పై మమకారం విగ్రహాన్ని ఏర్పరచి సహకారం
  • తమ్ముడు చనిపోయి ఏడాదైనా జ్ఞాపకాలు పదిలం
  • నీతో గడిపిన క్షణాలు జీవితాంతం మరువం
  • మేము చనిపోయే వరకు నీ జ్ఞాపకాలు మా గుండెల్లో అజరామరం
  • తమ్ముడు రామకృష్ణ అందుకో మా వందనం
  • తమ్ముడు రామకృష్ణ కోసం అన్న రమణమూర్తి పడ్డ ఆరాటం
  • బొప్పారం లో విగ్రహవిష్కరణ చేసి సోదర ప్రేమను చాటిన అన్న రమణమూర్తి
  • ఆత్మకూర్ ఎస్

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: వాళ్ళిద్దరూ ఒకే తల్లి గర్భమున పుట్టిన తోబుట్టులు. చిన్ననాటి నుంచి అన్యోన్యంగా పెరిగిన అన్నదమ్ములు బాల్యపు అనుభవాలు పాఠశాల తీపి గుర్తులు కుటుంబంలో మంచి చెడులు కష్టసుఖాలు కలిసి పంచుకున్న ఒకే అమ్మ అయ్య కన్నబిడ్డలు వారు. ఆ ఇద్దరు పుత్రులు తల్లిదండ్రులకు గారాల కొడుకులు. ఒకరిపై ఒకరికి ఎనలేని ప్రేమ. పెరిగి పెద్దవారై ఎవరికి వారు తమ కుటుంబాల్లో స్థిరపడ్డారు. అనుకోని విధిరాత ఆపద తెచ్చిపెట్టింది ప్రజాప్రతినిధిగా తను పుట్టిన ఊరికి పెరిగిన ప్రాంతానికి సేవలు చేసిన తమ్ముడు ఒక్కసారిగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అంతే ఆ అన్న హృదయం విస్పోటనానికి గురైంది సునామి ఒక్కసారి వచ్చి పడిందా అన్నంతగా హృదయం తల్లడిల్లింది. తన ప్రేమానురాగాల తమ్ముడితో తను గడిపిన ఆ మధుర క్షణాలను నెమరు వేసుకుంటూ గత జీవితం జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎలాగోలా కష్టం మీద సంవత్సరం గడిపాడు అన్న.

తన తమ్ముడు జీవితకాలం అందరికీ గుర్తుండేలా ఏదైనా చేయాలని ఆలోచనతో ముందుకెళ్లాడు తన తమ్ముడి నిలువెత్తు రూపాన్ని స్మరించుకున్నాడు అంతే ఆలోచన తట్టింది తన తమ్ముడి నిలువెత్తు రూపాన్ని తలుచుకుంటూ అదేవిధంగా విగ్రహాన్ని తయారు చేయించాడు సరిగ్గా నేటికీ తన తమ్ముడు చనిపోయి సంవత్సరకాలం. మొదటి సంవత్సరం వర్ధంతి సందర్భంగా తన తమ్ముడు విగ్రహాన్ని గ్రామంలో ప్రతిష్టింపజేశారు అన్న. తమ్ముడు కంటే తనకు ఏది ఎక్కువ కాదని తమ్ముడి జ్ఞాపకాలను వదులుకోలేక తమ్ముడిని తలుచుకుంటూ అన్నగా తన బాధ్యతలు భుజాన వేసుకొని ఒంటరిగా తమ్ముడు విగ్రహాన్ని శనివారం గ్రామంలో ఆవిష్కరింపజేసి తన బాధ్యతలను తన విధులను అన్న చక్కగా నిర్వర్తించడం చూసి ప్రజలు అన్నను అభినందించారు

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలం బొప్పారం గ్రామానికి చెందిన సర్పంచిగా సేవలందించిన తమ్ముడు గోపగాని రామకృష్ణ. అతను చనిపోయి నేటికీ ఏడాది. అతని సొంత అన్నయ్య గోపగాని రమణమూర్తి తమ్ముడి మరణాన్ని తట్టుకోలేక అతనితో ఉన్న బంధాలను మర్చిపోలేక వారిద్దరి మధ్య అనుబంధానికి గుర్తుగా విగ్రహాన్ని బొప్పారం గ్రామంలో తమ్ముడు రామకృష్ణ విగ్రహాన్ని ప్రతిష్టించారు. తమ్ముడు కోసం అన్న విగ్రహాన్ని తయారు చేపించి ఊరిలో ఏర్పాటు చేయడం పట్ల అన్న రమణమూర్తిని పలువురు అభినందించారు. కుటుంబ సభ్యులు గ్రామస్తులు తోడురాగా విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్విఘ్నంగా కోలాహలంగా కొనసాగింది.

ఈ విధంగా అన్న గోపగాని రమణమూర్తి తన తమ్ముడు 30 సంవత్సారాల రాజకీయ జీవితంలో 10 సంవత్సారాలు బొప్పారం సర్పంచ్ గా గోపగాని రామకృష్ణ తో ఉన్న పేగు బంధాన్ని రక్తసంబంధాన్ని ఆప్యాయత ప్రేమానురాగాలను తమ్ముడు రామకృష్ణ నిలువెత్తు రూపాన్ని కాంస్య విగ్రహంలో చూసుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నాడు. తమ్ముడి జ్ఞాపకాలు మరువలేని అన్న చేసిన ఈ కృషిని ప్రతివారు అభినందించక తప్పదు కదా. హ్యాట్సాఫ్ టు సోదర ప్రేమ అన్నదమ్ముల అనుబంధం విడవని విడిచిపోలేని లేని పేగు బంధం