కాలువలు ఇలా ... మురుగు పారేదెలా...?

కాలువలు ఇలా ... మురుగు పారేదెలా...?
  • దుర్గందాన్ని వెదజల్లుతున్న డ్రైనేజీలు
  • దోమలు , ఈగల కు నిలయంగా మారిన వైనం
  • సంవత్సరాల తరబడి పేరుకు పోయిన చెత్తా చెదారం
  • వర్షాకాల ప్రారంభంలో పొంచిఉన్న సీజనల్ వ్యాదుల ముప్పు

ముద్ర , కోదాడ :-కోదాడ పట్టణంలోని ప్రధాన రహదారికి ఇరువైపుల ఉన్న డ్రయినేజి సంవత్సరాల తరబడి శుభ్రం చేయకపోవడంతో కంపు కొడుతున్నాయి . డ్రైనేజిలో పేరుకుపోయిన చెత్తా చెదారం వలన వర్షపు నీరు ఎటూ వెళ్లక దోమలకు , ఈగలకు నిలయంగా మారింది  . రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీరు ఈ మురుగు కాలువలోకి చేరటంతో దుర్వాసన భరించలేకపోతున్నామని ప్రధాన రహదారివెంట ఉన్న దుకాణ దారులు వాపోతున్నారు.

  • అసలు విషయం ఏమిటంటే

కోదాడ పట్టణ నడి బొడ్డున ఉన్న ప్రధాన రహదారికి  ఇరువైపుల నాగుబండి రామ్మూర్తి నగర్ నుండి శ్రీరంగాపురం వరకు 2007 లో డ్రైనేజి కాలువల నిర్మాణం చేపట్టి పూర్తీ చేశారు . దాదాపు 12 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసినప్పటికీ వీటి నిర్వాహణ మున్సిపాలిటీ సక్రమంగా చేయకపోవడంతో కంపు కొడుతున్నాయి . ప్రధాన రహదారి వెంట ఉండటంతో దుకాణదారులు ఈ కాలువలను మూసి వేశారు . మరికొన్ని చోట్ల చిరు వ్యాపారులు కాలువలను ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు దీంతో కాలువలను శుభ్రం చెయ్యడానికి వీలుకాక పోవడంతో మున్సిపాలిటీ అలానే వదిలేస్తుంది . ప్రస్తుతం వర్షాలు ప్రారంభం అవ్వడంతో వర్షపు నీరు కాలువలోకి చేరి ఎటూ వెళ్లకుండ ఉండటంతో దుర్గందంతో పాటు దోమలు , ఈగలు కూడా పెరిగిపోతున్నాయని పట్టణ ప్రజలు వాపోతున్నారు . తక్షణమే ఈ మురుగు కాలువలను శుభ్రం చెయ్యాలని పట్టణ వాసులు కోరుతున్నారు .

  • మున్సిపల్ కమిషనర్ మహేశ్వర రెడ్డి వివరణ 

వారం రోజులలో శుభ్రం చేయిస్తాంప్రధాన రహదారివెంట ఉన్న డ్రయినేజీని త్వరలోనే శుభ్రం చేయిస్తాం , డ్రయినేజి మూసివేసిన దుకాణ దారులకి త్వరలో నోటీసులు అందజేస్తాం . సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటాం