ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ ధరఖాస్తులకు విశేష స్పందన

ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ ధరఖాస్తులకు విశేష స్పందన

దుబ్బాక,ముద్ర:సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో 18 ఏళ్ళు పై బడిన యువతి యువకులకు మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి  ఇచ్చే డ్రైవింగ్  లైసెన్స్ ధరఖాస్తుల సేకరణకు విశేష స్పందన వస్తోంది. అందులో భాగంగా గురువారంనాడు పెద్ద ఎత్తున యువతి,యువకులు ఎంపి క్యాంప్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేశారు. గురువారం ఒక్క రోజు 1464 దరఖాస్తులు ప్రజల నుండి తీసుకున్నామని క్యాంప్ నాయకులు  తెలిపారు.ఇప్పటి వరకు 5540 దరఖాస్తులు తీసుకున్నామని ఇంకా ఎవరైనా యువతి,యువకులు అప్లై చేసుకునే వారు ఉంటే ఈ నెల 13 న సాయంత్రం 4 గంటల లోపు దుబ్బాక లోని ఎంపీ ఆఫీసు లో అందజేయాలని సూచించారు.