షాదిఖానా నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలి.. ఖుతుబోద్దిన్ పాషా

షాదిఖానా నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలి.. ఖుతుబోద్దిన్ పాషా

మెట్‌పల్లి ముద్ర: పట్టణంలో జరుగుతున్న షాదిఖానా నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని పట్టణ మర్కజ్ ఇంతేజామీ కమిటీ మిల్లతే-ఎ-ఇస్లామియ అధ్యక్షుడు ఖుతుబోద్దిన్ పాషా డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని బీడీ కాలనీలో జరుగుతున్న షాదీఖానా నిర్మాణ పనులను పరిశీలించారు.పట్టణంలో షాదీఖానా నిర్మాణ పనులను ప్రారంభించి సుమారు 7 నెలలు గడుస్తున్నప్పటికీ పనులను పూర్తి చేయడం లేదన్నారు. పనులు ప్రారంభించే సమయంలోనే ఆరు నెలల్లో పూర్తి చేస్తామని ప్రజా ప్రతినిధులు మాట ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఏడు నెలలు గడుస్తున్నప్పటికీ పనులు అసంపూర్తిగానే కొనసాగుతున్నాయని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా షాదీ ఖానా నిర్మాణం కోసం ఎదురుచూస్తున్నప్పటికీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా పనులు నేటికీ పూర్తి కావడం లేదన్నారు.

ఎన్నో ఏళ్లుగా పోరాటం చేసి షాదీ ఖానా నిర్మాణం చేసుకుంటున్నప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిర్మాణ పనులు నేటికీ పూర్తి చేయడం లేదన్నారు. నిర్మాణ విషయమై కాంట్రాక్టర్ ను అడిగితే ప్రభుత్వం నుంచి బిల్లులు విడుదల కావడం లేదని చెబుతున్నారని, కేవలం ముస్లిం మైనార్టీలకు సంబంధించి మాత్రమే బిల్లులనుఎందుకు నిలిపిస్తున్నారని ప్రశ్నించారు.

ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ముస్లిం మైనార్టీలను చిన్నచూపు చూస్తుందని, కేవలం వారిని ఓటు బ్యాంకుగా మాత్రమే వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. కాగా వచ్చే మూడు నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో అంతలోపే నిర్మాణ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వస్తే పనులు ఎక్కడికి అక్కడ నిలిచిపోయే ప్రమాదం ఉందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పనులను పూర్తి చేసి షాదికానను ముస్లిం మైనార్టీలకు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన ముస్లిం మైనారిటీ నాయకులు ముతిబుల్ రెహమాన్, అబ్దుల్ నయీం, ఫెరోజ్, మొకీం, మదర్, రహీముద్దీన్, సాదక్, మతీన్ తదితరులు పాల్గొన్నారు.