మృతుడి కుటుంబానికి ప్ర‌మాద బీమా చెక్కు పంపిణీ...

మృతుడి కుటుంబానికి ప్ర‌మాద బీమా చెక్కు పంపిణీ...

ముద్ర‌, హుజూరాబాద్ : పట్టణానికి చెందిన ధర్మపురి నారాయణ స్వామి ఇటీవ‌ల రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెంద‌గా బుధ‌వారం త‌పాల ప్ర‌మాద బీమా చెక్కును పోస్ట‌ల్ అధికారులు మృతుడి కుటుంబ స‌భ్యుల‌కు అంద‌జేశారు. త‌పాల శాఖ‌లో ఇటీవ‌ల నారాయ‌ణ స్వామి రూ.399ల‌తో ప్ర‌మాద బీమా తీసుకున్న‌ట్లు తెలిపారు. నారాయ‌ణ‌స్వామి మ‌ర‌ణానంత‌రం ప్ర‌మాద బీమా ప‌థ‌కం వ‌ర్తించి రూ. 10 ల‌క్ష‌లు వ‌చ్చిన‌ట్లు తెలిపారు.

ప్ర‌మాద బీమా చెక్కును పోస్టల్ సూపరింటెం డెంట్ పసునూరి ప్రభాకర్, మున్సిపల్ చైర్మన్ గందె రాధిక శ్రీనివాస్ చేతుల మీదుగా మృతుడి కుటుంబ స‌భ్యులు అందుకున్నారు. ఈ కార్యక్ర మంలో పోస్టల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ అనంతరామ్ నాయక్, ఇన్స్పెక్టర్ పోస్ట్స్ నరేష్ అరికాల, పోస్టు మాస్టర్ ఉకంటి మహేందర్, ఐపీపీబి మేనేజర్ శ్రీనివాస్ త‌దితరులు ఉన్నారు.