సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి- ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి- ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి

చిగురుమామిడి ముద్ర న్యూస్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబల కుండ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.చిగురుమామిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జన ఆరోగ్య సమితి చైర్ పర్సన్,ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన బుధవారం  జన‌ ఆరోగ్య సమితి సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ... వర్షకాలంలో మలేరియా, డెంగీ, చికెన్ గున్యా వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంటుందని వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి,మెంబర్ సెక్రటరీ  డా ధర్మ నాయక్, సభ్యులు  పిఆర్ ఏఈ రవి ప్రసాద్,సర్పంచ్ బెజ్జంకి లక్ష్మణ్ , డా. ఆఫ్సాన,భారతి,కనుకయ్య,సిహెచ్ఓ రఫీక్, సూపర్వైజర్   హజిబాబ పాల్గొన్నారు.