మొక్కజొన్న రైతులను దోచుకుంటున్న దళారులు

మొక్కజొన్న రైతులను దోచుకుంటున్న దళారులు

ముద్ర, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలో మొక్క జొన్న రైతులను క్వింటాకు 200 నుండి 300 వరకు తక్కువ ధరతో దోపిడీ చేస్తున్నారు. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో అధికారులు తేమ శాతం అంటు మొక్కజొన్నకు గన్ని సంచులు ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు, మొక్క జొన్న విక్రయించుకోవడానికి మార్కెట్ యార్డ్ కు వచ్చిన రైతులు తమ పేర్లు భూమి వివరాలు ఆన్లైన్లో నమోదు కాలేదని తెలపడంతో రైతులు విస్మయానికి గురవుతున్నారు దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తక్కువ ధరలకు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో ఒక్కో క్వింటాకు సుమారు 200 నుండి 300 వరకు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదే అనువుగా భావించిన దళారులు మొక్కజొన్న రైతులను దోపిడీకి గురి చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి మొక్కజొన్న రైతులకు న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు.