ధూమపానం ఆరోగ్యానికి హానికరం అవగాహన ర్యాలీ 

ధూమపానం ఆరోగ్యానికి హానికరం అవగాహన ర్యాలీ 

ముద్ర, జమ్మికుంట: జమ్మికుంట మండలం వావిలాల గ్రామంలో పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సనజవేరియా పర్యవేక్షణలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అన్ని ఆరోగ్య ఉప కేంద్రాల వైద్య సిబ్బంది పొగాకు వ్యతిరేక దినోత్సవం, అవగాహన ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ సిబ్బంది ధూమపానం చేయడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలను, సిగరెట్ వినియోగం వల్ల వచ్చే నష్టాలను,పొగాకు ఒక జీవితమే కాకుండా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుందని, ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. భారత ప్రభుత్వం పొగాకును కొన్ని బహిరంగ ప్రదేశాల్లో వినియోగించడం నిషేధికరించింది. అందుకే ప్రతి సంవత్సరం పొగాకు, ధూమపానం చేయడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యల గురించి అవగాహన కల్పించారు.